Begin typing your search above and press return to search.
75 ఏళ్ల తర్వాత కలిసిన అన్నాదమ్ములు.. ఒకరు భారత్ లో.. మరొకరు పాకిస్తాన్ లో.. కన్నీళ్లు ఆగవు
By: Tupaki Desk | 17 Aug 2022 12:30 AM GMTతోడబుట్టిన వారితో కలిసి ఉండేది కేవలం 20 ఏళ్లే. తర్వాత ఉద్యోగ, ఉపాధి కోసం సుదూర తీరాలకు వెళ్లిపోవడంతో పండుగలు పబ్బాలకు మాత్రమే కలిసే ఛాన్స్ ఉంటుంది. అయితే జీవితంలో కలవలేనంత దూరం వెళితే.. దాదాపు 75 ఏళ్ల తర్వాత కంటపడితే ఆ కన్నీళ్లు ఆగవు ఇక.. ఇప్పుడు భారత్, పాకిస్తాన్ లోని అన్నాదమ్ముల కలయిక కూడా గుండెల్ని పిండేసింది. స్వాతంత్య్రానికి పూర్వం విడిపోయిన ఈ అన్నాదమ్ములు ఇప్పుడు కలిసి కన్నీళ్ల పర్యంతం అయ్యారు.ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న సోదరులు ఇద్దరూ భావోద్వేగంతో నోట మాట రాలేక ఏడ్చేశారు.
80 ఏళ్ల మహ్మద్ సిద్దిక్.. 78 ఏళ్ల మహ్మద్ హబీబ్ లు అన్నాదమ్ములు. వీరిద్దరూ భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన విభజన సమయంలో విడిపోయారు. ఆనాటి కల్లోలంలో వీరి కుటుంబం జలంధర్ నుంచి పాకిస్తాన్ బయలు దేరింది. సోదరి, తల్లితో కలిసి హబీబ్ అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. సరిగ్గా ఇదే సమయంలో దేశ విభజన జరిగింది. సరిహద్దుల్లో అల్లకల్లోలం కారణంగా ప్రాణభయంతో ఊరు వదిలి వెళ్లిపోయారు. నాన్న, అక్కతో కలిసి సిద్ధిక్ పైసలాబాద్ లోని శరణార్థి శిబిరానికి చేరుకున్నాడు. అక్కడ సిద్ధిక్ అక్క జబ్బు పడి చనిపోగా.. చాలా రోజులు తండ్రి అక్కడకు వచ్చాడు.
కుటుంబం దూరం కావడంతో హబీబ్ తో ఉన్న అమ్మ చనిపోయింది. ఆమె పుట్టింటి వాళ్లు కూడా పాకిస్తాన్ వెళ్లిపోయారు. సర్ధార్ అనే స్నేహితుడితో హబీబ్ ఉండిపోయాడు. హబీబ్ అమ్మమ్మ కూడా పాకిస్తాన్ వచ్చేయడంతో ఇండియాతో అసలు సంబంధాలు లేకుండాపోయాయి.
మరోవైపు సిద్ధిక్ తన మేనమామల వద్ద పెరిగాడు. పైసలాబాద్ లో కొంతకాలం ఉండి తర్వాత వ్యవసాయం చేస్తూ పెళ్లి చేసుకున్నాడు. హబీబ్ మాత్రం పెళ్లి చేసుకోకుండా తన స్నేహితుడి కుటుంబంతోనే ఉన్నాడు.
తాజాగా తన తమ్ముడు బతికే ఉన్నాడని సిద్ధిక్ తన మిత్రుడు కొడుకు ఇష్రాక్ సహాయంతో ఓ వీడియో తీసి పాకిస్తాన్ లోని మిత్రులకు పంపించారు. దీంతో తమ్ముడు ఆచూకీ తెలిసి ఫొన్లో అన్నాదమ్ములు మాట్లాడుకున్నారు. హబీబ్ పాకిస్తాన్ రావాలనుకున్నాడు. అది సాధ్యం కాకపోతే సిద్ధిక్ ఇండియా వెళ్లాలని అనుకున్నాడు. కరోనాతో ఆలస్యమైంది. కర్తార్ పూర్ కారిడార్ తెరవడంతో 74 ఏళ్ల తర్వాత ఈ అన్నాదమ్ములు కలుసుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విభజన గాయాలను గుర్తు చేస్తోంది.