Begin typing your search above and press return to search.
వీడియో: ఉలిక్కిపడ్డ దేశం.. జేఎన్యూలో దారుణం
By: Tupaki Desk | 6 Jan 2020 5:45 AM GMTదేశం మరోసారి ఉలిక్కి పడింది. విద్యార్థుల పై పాశవిక దాడి జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (జే.ఎన్.యూ)లో నిన్న రాత్రి దారుణం జరిగింది. కొంత మంది ముసుగు ధరించిన దుండగులు యూనివర్సిటీ పై పడి పెద్ద పెద్ద రాళ్లు, కర్రలు, సుత్తెలు, ఆయుధాలు చేతబట్టి బీభత్సం చేశారు. దుండగులు చేసిన దాడితో వర్సిటీ లోని విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
సరిగ్గా నిన్న సాయంత్రం 6.30 గంటల సమయం.. ఢిల్లీలో చలి దుప్పటికి జనాలు వణికిపోయి ఎవరి ఇళ్లల్లో వారున్నారు. ముఖాలకు ముసుగు వేసుకున్న దాదాపు 50మంది దుండగులు వర్సిటీ క్యాంపస్ లోకి చొరబడ్డారు. అద్దాలు పగుల కొడుతూ సబర్మతి, మహిమాండ్వి, పెరియార్ హాస్టల్స్ లోకి దూరి విద్యార్థులను చావబాదారు. వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోస్ తల పగులకొట్టారు. విచక్షణ రహితంగా దాడిలో 15మందికి పైగా తీవ్ర గాయాలతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ దాడి ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీబీపీ చేసిందని గాయపడ్డ విద్యార్థులు ఆరోపించారు. అయితే ఏబీవీపీ మాత్రం ఖండించింది. తమ ఏబీవీపీ వాళ్లు గాయ పడ్డారని.. ఈపని చేసిందని డీఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాలని ఆరోపించిది.
అయితే కొద్దిరోజులగా జేఎన్ యూనివర్సిటీలో సీఏఏ, ఎన్నార్సీలపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. దీనికి ప్రతీ కారంగానే ఏబీవీపీ నేతలు ఈ దాడి చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా దాడులకు దిగిన వారు క్యాంపస్ లో హల్ చల్ చేస్తున్న సీసీటీవీ దృశ్యాలు చిక్కాయి. అల్లరి మూక జేఎన్యూ గేట్ వద్ద నినాదాలు చేసినా పోలీసులు చూస్తూ ఊరుకుండడం దుమారం రేపింది. పోలీసుల సహకారంతో ఈ దాడి జరిగిందని వీడియోలు బయటపడడంతో వైరల్ గా మారాయి. గాయపడ్డ వారిని తరలించేందుకు తెచ్చిన అంబులెన్స్ టైర్లలో గాలిని కూడా ఈ ముసుగు దుండగులు తీస్తున్నా పోలీసులు చేష్టలుడి చూడడం గమనార్హం.
జేఎన్యూలో దాడిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ముస్లిం యూనివర్సిటీల విద్యార్థులు నిరసన తెలిపారు.