Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: జే.ఎన్.యూ లో దాడి చేసింది ఏబీవీపీ నేతలే!
By: Tupaki Desk | 6 Jan 2020 11:10 AM GMTకేంద్రం లోని బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనలకు కేంద్రబిందువైన ఢిల్లీలోని ప్రఖ్యాత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీని కొంతమంది దుండగులు రణరంగంగా మార్చేశారు. రాడ్లు, సుత్తెలు, ఆయుధాలు చేతబట్టి తోటి విద్యార్థులను చావబాదారు... ఈ దాడిలో జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ సహా దాదాపు 20 మంది తీవ్రగాయాలై పాలై ఆస్పత్రిపాలయ్యారు. అసలు జేఎన్యూలో ఈ దారుణానికి కారకులెవరన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.
కొద్దిరోజులగా జేఎన్ యూనివర్సిటీ లో సీఏఏ, ఎన్నార్సీల పై వామపక్ష, ముస్లిం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హిందుత్వ అనుకూల నిర్ణయాలపై పోరాడుతున్నారు. దీనికి ప్రతీకారంగానే ఏబీవీపీ నేతలు ఈ దాడి చేసినట్టు కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
అయితే ఏబీవీపీ మాత్రం ఖండించింది. తమ ఏబీవీపీ వాళ్లు గాయపడ్డారని.. ఈ పని చేసిందని డీఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాలని ఆరోపించింది. ఇలా ఏబీవీపీ వర్సెస్ వామపక్ష విద్యార్థి సంఘాల విద్యార్థులు పరస్పర ఆరోపణలు చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ దాడులు చేసిన వారు ఎవరో సోషల్ మీడియా సాక్షిగా బయటపడింది. దాడి చేశాక సాయంత్రం 7గంటల ప్రాంతంలో వాట్సాప్ గ్రూపుల్లో ‘దాడి చేశాం.. చితకబాదాం’ అని కొంతమంది పోస్టు చేయడంతో వారు ఎవరనేది తెలిసిపోయింది. ఈ మేరకు ‘స్క్రోల్ డాట్ ఇన్’ అనే మీడియా ఈ వాట్సాప్ సందేశాలను బయటపెట్టి నిందితులు ఎవరనేదానిపై సంచలన నిజాలు బయటపెట్టింది.
హాస్టల్ లోకి ప్రవేశించి చిత్తు చిత్తుగా కొట్టామని సందేశం పంపింది సౌరవ్ దూబే అనే వ్యక్తి అని మీడియా తెలిపింది. ఈయన ఢిల్లీలోని షహీద్ భగత్ సింగ్ కాలేజీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తుండడం విశేషం. ‘జేఎన్యూటీస్ ఫర్ మోడీ’ గ్రూపును ఇతడు నడుపుతున్నాడు. ఇక మరో ఆర్ఎస్ఎస్ గ్రూపు, మరో హిందుత్వ గ్రూపులో కూడా వారిని చితకబాదాల్సిందేనంటూ పోస్టులు పెట్టారు.
ఇక వికాస్ పటేల్ అనే ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సైతం ఈ దాడిలో పాల్గొన్నట్టు ‘యునిటీ అగెనెస్ట్ లెఫ్ట్’ గ్రూపులో రాత్రి 8.41 గంటలకు పోస్ట్ చేశారు. ఇక మరో మెసేజ్ ఓంకార్ శ్రీవాత్సవ నుంచి వచ్చింది. ఈయన కూడా ఏబీవీపీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
అయితే మీడియాకు ఇవి లీక్ కావడం.. ప్రసారం చేయడంతో వారు వాట్సాప్ లలో ఆ మెసేజ్ లు డిలీట్ చేశారు. వారి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. పోలీసులు దీనిపై స్పందించలేదు. దీన్ని బట్టి ఈ పనిచేసింది ఏబీవీపీ మద్దతు దారేలనని తేలింది..