Begin typing your search above and press return to search.
ప్రేమోన్మాదం: ప్రేమను కాదందని దారుణ హత్య
By: Tupaki Desk | 2 July 2021 7:30 AM GMTప్రేమ గుడ్డిదంటారు.. తేడా వస్తే చెడ్డది కూడా.. నెల్లూరులో ఓ ప్రేమోన్మాది తన ప్రేమను నిరాకరించిందన్న కసితో యువతిని అతి దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి గదిని మూసి హత్య చేశాడు. ఆపై అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. యువతి చనిపోగా.. ఆ ప్రేమోన్మాది చికిత్స పొందుతున్నాడు.
నెల్లూరు జిల్లా గూడూరులో సుధాకర్-సరిత దంపతులు నివసిస్తున్నారు. దంపతులిద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె , కుమారుడు ఉన్నారు. కుమార్తె తేజస్విని ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది.
ఇదే క్రమంలో సుధాకర్ సహచర ఉద్యోగి చెంచు కృష్ణయ్య కుమారుడు వెంకటేశ్ కు తేజస్వినితో పరిచయం పెరిగింది. అది కాస్తా ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. అయితే ఏడాది కాలంగా వెంకటేశ్ ప్రవర్తనతో తేజస్విని విసుగు చెంది అతడిని దూరం పెట్టింది. వెంకటేశ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆయన తండ్రి బెంగళూరు పంపించాడు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో తిరిగి అతడు గూడురు వచ్చాడు. అప్పటి నుంచి మళ్లీ తేజస్విని వెంటపడడం మొదలుపెట్టాడు. తరచూ ఫోన్లు చేసి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక తేజస్విని తన ఫోన్ నంబర్ కూడా మార్చేసింది.
దీనికి వెంకటేశ్ రగిలిపోయాడు. కోపంతో ఊగిపోయాడు.. తేజస్వినిపై కక్ష పెంచుకున్నాడు. ఆమెపై దాడి చేసేందుకు ఎదురుచూసాడు. సుధాకర్-సరిత స్కూల్ కు వెళ్తుంటారు కాబట్టి ఆ తర్వాత ఇంట్లో తేజస్విని, ఆమె తమ్ముడు ఉన్నట్టు గుర్తించాడు. తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లగానే తన స్నేహితుడితో కలిసి అపార్ట్ మెంట్ వద్దకు వెళ్లాడు.
తేజస్విని ఉంటున్న ఫ్లాట్ లోకి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు మూశాడు. ఆపై కత్తితో ఆమె గొంతులో పొడిచాడు. అయినా తన కోపం చల్లారకపోవడంతో చున్నీని మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి కసితీరా ప్రాణం పోయేదాకా చంపేశాడు. ఆమె చనిపోయేదాకా వదిలిపెట్టలేదు.
ఆ తర్వాత అదే గదిలో చున్నీతో కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించారు. సుధాకర్ కుటుంబం పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని తేజస్విని, వెంకటేశ్ లను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తేజస్విని మృతిచెందగా.. వెంకటేశ్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.