Begin typing your search above and press return to search.
బుల్లెట్ దూసుకొచ్చినా ఆమె బతకటం వెనుక కారణం తెలిస్తే షాకే
By: Tupaki Desk | 23 April 2020 11:30 PM GMTవినేందుకు విచిత్రంగా అనిపించినా.. కొన్ని అంశాలు తెలిసినంతనే విస్మయానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఒక మహిళకు బుల్లెట్ దూసుకొచ్చి ఆమె వక్షోజాల్ని తాకింది. అయినప్పటికి ఆమె బతికిపోవటం వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. అయితే.. కారణం ఏమిటన్న విషయాన్ని లోతుగా పరిశీలించినప్పుడు అసలు కారణం బయటకు వచ్చింది. కెనడాలోని టొరంటోలో చోటు చేసుకున్న ఈ అరుదైన ఉదంతం గురించి తెలుసుకోవాల్సిందే.
దాదాపు రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ అరుదైన ఉదంతం గురించి తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దాని ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళపై కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ఒక బుల్లెట్ ఆమె ఎడమ వక్షోజం నుంచి దూసుకెళ్లి కుడి వక్షోజాన్ని తాకింది. అయితే.. ఆ బుల్లెట్ నేరుగా గుండెను తాకకుండా పక్కకు వెళ్లిపోయింది.
రక్తస్రావంతో ఆసుపత్రికి వెళ్లిన ఆమెను పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మరణిస్తారు. అందుకు భిన్నంగా ఆమె బతకటానికి కారణం ఆమెకున్నవి సహజమైన వక్షోజాలు కావని.. సిలికాన్ ఇంప్లాంట్స్ గా గుర్తించారు. కొందరు మహిళలు తమకున్న రొమ్ములు చిన్నవిగానూ.. సరైన షేపులో లేకుంటే వాటిని పెద్దవిగా.. మంచి షేపులో కనిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. అలాంటివాటికి సిలికాన్ బెలూన్లను అమరుస్తారు.
జరిగిందేమంటే.. కాల్పులు జరిపిన సమయంలో బుల్లెట్ ఆమె ఎడమ వక్షోజానికి తగిలి అది కాస్తా కుడివైపునకు దూసుకెళ్లిందని.. దీని కారణంగా సిలియన్ ఇంప్లాంట్ తలకిందులైనట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో ఆమె పక్కటెముకలు విరిగినట్లుగా గుర్తించారు. దీంతో ఆమె వక్షోజాల్లోని రెండు సిలికాన్ ఇంప్లిమెంట్లను తొలగించారు. ఇది చాలా అరుదైన ఉదంతంగా పలువురు అభివర్ణిస్తున్నారు.