Begin typing your search above and press return to search.

మంత్రివ‌ర్గం మార్చి.. మిస్టేక్ చేశారా... వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌...!

By:  Tupaki Desk   |   22 Sep 2022 2:30 AM GMT
మంత్రివ‌ర్గం మార్చి.. మిస్టేక్ చేశారా... వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌...!
X
వైసీపీలో అత్యంత ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న మంత్రి వ‌ర్గంపై.. సీఎం జ‌గ‌న్ తీవ్ర అసం తృప్తితో ఉన్నారని.. వార్తలు వ‌స్తున్నాయి. ఆయ‌న ఎన్నో ఆశ‌ల‌తో రెండో సారి మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే.. వారు మాత్రం.. జ‌గ‌న్ ఆశ‌ల‌కు.. ఆశ‌యాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని.. పార్టీలో కీల‌క నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌సాగుతోంది. జ‌గ‌న్ కూడా ఇలానే ఆలోచిస్తున్నార‌ని.. అంటున్నారు. గ‌త మంత్రి వ‌ర్గంలో మెయిన్ గా గ‌ళంగా వినిపించిన‌.. కీల‌క నేత‌ల‌ను త‌ప్పించేశారు.

వీరి స్థానంలో.. కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చారు. సామాజిక వ‌ర్గాల ప‌రంగా.. మంచి ఈక్వేష‌నే అయినా.. క‌నీ సం..ఈ విష‌యాన్ని కూడా వారు త‌మ త‌మ సామాజిక‌వ‌ర్గాల్లోకితీసుకువెళ్లి.. పార్టీని బ‌లోపేతం చేసేందు కు ఎక్క‌డా ప్ర‌య‌త్నించ‌డం లేద‌ని.. అంటున్నారు. ఇది .. జ‌గ‌న్‌కు ఒక‌వైపు ఆగ్ర‌హంతోపాటు.. మ‌రోవైపు.. అస‌హ‌నం కూడా క‌లిగిస్తోంద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. అనంత‌పురంలో కుర‌బ సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట వేశారు. అయినా.. అక్క‌డ ఈ వ‌ర్గాన్ని పార్టీకి అనుకూలంగా మార్చే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోతు న్నారు.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోను.. విశాఖ‌లోనూ.. కాపుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అయితే.. వీరు కూడా.. కాపుల‌ను ఏకం చేసే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోతున్నార‌ట‌. ఇక‌, ఎస్సీ, ఎస్టీ మంత్రులు ఉన్నా.. వారు ఏం చేస్తున్నారో.. తెలియ‌డం లేద‌ని..

ఆయా వ‌ర్గాల‌ను పార్టీలో మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఎవ‌రూ కృషి చేయ‌డం లేద‌ని.. పార్టీ అధిష్టానం భావిస్తోంది.మ‌రోవైపు.. పార్టీ త‌ర‌ఫున కూడా వీరు మాట్లాడ‌లేక‌పోతున్నా రనే వాద‌న వినిపిస్తోంది. బీసీ మంత్రులు ఇదే పంథాలో ఉన్నార‌ని..చెబుతున్నారు.

దీనికి తోడు.. అస‌లు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పైనా ప్ర‌స్తుత మంత్రుల్లో చాలా మందికి అవ‌గాహ‌న లేకుండా పోయింద‌ని చెబుతున్నారు. క‌నీసం.. మేనిఫెస్టోపైనా..వారు ప‌ట్టు సాధించ‌లేక పోతున్నార‌ని.. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సీఎం జ‌గ‌నే అభిప్రాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. ఇక‌...

త‌మ త‌మ శాఖ‌ల్లో నిధులు ఎంత ఉన్నాయి.. ఎన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు అవుతున్నాయి.. వంటి కీల‌క స‌మాచారం కూడా వారి వ‌ద్ద‌లేద‌నే విష‌యంపై పార్టీ అధిష్టానం.. మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంద‌ట‌. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సీనియ‌ర్లు.. మంత్రి వ‌ర్గాన్ని మార్చి త‌ప్పు చేశారా? అనే చ‌ర్చను తెర‌మీదికి తెస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.