Begin typing your search above and press return to search.
సీఎం జగన్ కు కాపు నేత ముద్రగడ మరో లేఖాస్త్రం
By: Tupaki Desk | 22 Jan 2022 7:07 AM GMTకాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు.. కాపుల సమస్యల పరిష్కారం.. కాపుల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం కొన్నేళ్లుగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర కూడా చేశారు. మొన్నటివరకు ముద్రగడ నేతృత్వంలో కాపు ఉద్యమం బలంగా నడిచింది. ఆ తర్వాత విమర్శలతో కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని నడపలేనని ముద్రగడ స్పష్టం చేశారు.
లేఖలతో అధికార, ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న ముద్రగడ పద్మనాభం తాజాగా ఏపీ సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం లేఖలు రాసిన ముద్రగడ తాజాగా మరోసారి ఓటీఎస్ పై బహిరంగ లేఖను రాశారు. ఓటీఎస్ విధానంపై జగన్ సర్కార్ ను ప్రశ్నించారు.
ఓటీఎస్పేరుతో పేదల ప్రజలపై ఒత్తిడి తేవద్దంటూ సీఎం జగన్ ను ముద్రగడ కోరారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించికాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని లేఖ ద్వారా సీఎంను కోరారు.
గతంలో ఎప్పుడో పేదవారికి ఇచ్చిన రుణాలను ఇప్పుడు ఓటీఎస్ పేరుతో వసూలు చేయడం ఇప్పటివరకూ జరగలేదని అసలు పేదవారి ఇళ్లకు ఇచ్చిన అప్పును తప్పనిసరిగా కట్టమని ఏ ప్రజాప్రతినిధి కూడా చెప్పిన సందర్భం ఇప్పటివరకూ రాలేదని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు.. గత ప్రభుత్వాలు పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం ఎక్కడిది? అంటూ సీఎం జగన్ను ముద్ర గడ ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా మీ నిర్ణయం సరికాదని.. వారిని ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదన్నారు. ఓటీఎస్ విధానంపై అనేక విమర్శలను ఎదుర్కొంటున్న జగన్ సర్కార్ కు ఇప్పుడు ముద్ర గడ లేఖతో మరింత హీట్ పెరిగింది..