Begin typing your search above and press return to search.
సుందర్ పిచాయ్ పై కేసు తీసేసిన వారణాసి పోలీసులు
By: Tupaki Desk | 13 Feb 2021 9:30 AM GMTఒక ప్రముఖుడికి సంబంధించిన విషయంలో.. మరో ప్రముఖుడిపైన కేసు నమోదు చేసిన వైనం సంచలనంగా మారింది. వారణాసి పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా వీడియో వాట్సాప్.. యూ ట్యూబ్ లలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసుకు సంబంధించి గూగుల్ ఇండియాకు సంబంధించిన అధికారుల మీదా కేసు నమోదు చేశారు.
ప్రధాని మోడీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉన్న ఈ వీడియోపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై భేలుపుర్ పోలీసులకు ఫిబ్రవరి ఆరున ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు గూగుల్ ప్రతినిధులతో సహా పదిహేడు మందిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఈ వీడియో ఉదంతంలో సుందర్ పిచాయ్ మీదా కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది.
గూగుల్ సీఈవో మీదనే కేసు నమోదు చేయటంపై సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన విషయాలతో సుందర్ పిచాయ్ తో పాటు.. గూగుల్ ఉన్నత అధికారుల ప్రమేయం లేదని గుర్తించిన వారణాసి పోలీసులు.. వారి పేర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక.. ఈ వీడియోను రూపొందిస్తున్న గాజీపూర్ జిల్లాకు చెందిన సంగీత కళాకారుల పేర్లను ఎఫ్ఐఆర్ లో ఉంచారు. ఈ అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిజానికి.. గూగుల్ లాంటి అతి పెద్ద ఫ్లాట్ ఫాంలో ఒక వీడియో అప్ లోడ్ తో.. సంస్థ సీఈవోకు లింకు ఉన్నట్లుగా భావిస్తే.. ఆయనపై నిత్యం వేలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయిందన్న ఉద్దేశంతోనే వారణాసి పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు.