Begin typing your search above and press return to search.
అంబికా సంస్థల పై సీబీఐ దాడులు !
By: Tupaki Desk | 4 Nov 2020 3:50 PM GMTపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని అంబికా సంస్థలపై సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. అంబికా సంస్థలతో పాటుగా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంబికా సంస్థలకు సంబంధించి వేర్వేరు పేర్లతోలోన్లు సేకరించారన్న నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు.
ఇక, మరోవైపు అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ గృహంలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఏలూరు పవర్ పేట స్టేట్ బ్యాంకులో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, 7 నెలల అనంతరం మరోమారు ఇలా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ సోదాలకు సంబంధించి ఇంతవరకూ అధికారులు కానీ, అంబికా కానీ మీడియా ముందుకు రాలేదు. అయితే సోదాల్లో ఏమేం దొరికాయి, లోన్ల సంగతేంటి అనే విషయాలపై సీబీఐ అధికారులు ఈ రోజు సాయంత్రం మీడియా మీట్ నిర్వహించి వెల్లడిస్తారని సమాచారం.