Begin typing your search above and press return to search.

డాక్టర్ దేవుడు ఎందుకో చెప్పిన సీసీ ఫుటేజ్.. అస్సలు మిస్ కావొద్దు

By:  Tupaki Desk   |   7 Sep 2022 10:30 AM GMT
డాక్టర్ దేవుడు ఎందుకో చెప్పిన సీసీ ఫుటేజ్.. అస్సలు మిస్ కావొద్దు
X
డాక్టర్ ను దేవుడు అంటారు. అదెందుకు అంటారో కళ్లకు కట్టినట్లుగా చూపించింది సీసీ కెమేరా పుటేజ్. దీనికి సంబంధించి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. సదరు వైద్యుడ్నిప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. కరోనాకు ముందు కూడా కార్డియాక్ అరెస్ట్ లున్నా.. కరోనా తర్వాత మన కళ్ల ముందే చాలా ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వేళ.. ఆ వ్యక్తి కుప్పకూలిపోవటం.. ప్రాణాలు విడిచిన వైనాలు.. వాటికి సంబంధించిన మరణాల్ని చూస్తూ విషాదంలోకి జారిపోవటం తెలిసిందే.

అయితే.. తాజా ఉదంతంలో మాత్రం డాక్టర్ పుణ్యమా అని చనిపోవాల్సిన వ్యక్తి బతికిపోయిన వైనమిది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన అర్జున్ అద్నాయక్ కార్డియాలజీ నిపుణుడు. పేరు ప్రఖ్యాతులు ఉన్న వైద్యుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా ఆయన వద్దకు ఒక రోగి (అర్జున్) వచ్చారు. ఆయన తరచూ జనరల్ చెకప్ కోసం వస్తుంటారు. 12 ఏళ్ల క్రితంఆయనకు పేస్ మేకర్ ను అమర్చారు. ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా ఆయన వస్తుంటారు.

తాజాగా ఆయన డాక్టర్ ఎదురుగా చెకప్ కోసం కూర్చున్నారు. వేరే వారిని వైద్యుడు చూస్తున్నారు. ఇలాంటి వేళ.. ఆయన ఉన్నట్లుండి వెనక్కి వాలిపోవటాన్ని గుర్తించిన డాక్టర్ అర్జున్ క్షణంలో వెయ్యో వంతు అన్నంత వేగంగా స్పందించారు. క్షణంలో రోగి వద్దకు పరిగెత్తిన ఆయన.. ఆలస్యం చేయకుండా అక్కడికక్కడే సీపీఆర్ చేశారు. సెకన్ల వ్యవధిలోనే రోగి సాధారణ స్థితికి చేరుకున్నారు. ఆ వెంటనే తన సీట్లోకి వెళ్లిన వైద్యుడు తన పని మళ్లీ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోగికి గుండె పోటు వచ్చిన మూడు.. నాలుగు క్షణాల్లో డాక్టర్ స్పందించటం.. రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడిందని చెప్పాలి. ఈ వీడియోను పెద్ద ఎత్తున చూస్తున్నారు. వైద్యుడ్ని అభినందిస్తూ పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు ధనంజయ్ మహాదిక్ సైతం ఈ వీడియోను పోస్టు చేసి పెద్ద ఎత్తున పొగిడేశారు.

మన మధ్యలో రియల్ హీరోలు జీవిస్తారని చెప్పేందుకు ఈ వీడియో సాక్ష్యమని.. డాక్టర్ అర్జున్ అద్నాయక్ కోల్హాపూర్ లోనే గొప్ప కార్డియాలజిస్టు.. ఇలాంటి వ్యక్తులకు నా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. డాక్టర్ ను దేవుడంటారు. అదెలానో ఈ వీడియో చెప్పేస్తుంది. అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ప్రాణాలు పోవటం చూస్తాం. కానీ.. ఈ వీడియోలో పోయే ప్రాణాల్ని కాపాడటం ఉంటుంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.