Begin typing your search above and press return to search.
వందేళ్లనాటి సాంప్రదాయం మళ్లీ ప్రారంభం ... శ్రీవారికి ప్రకృతిసిద్ధ నైవేద్యం !
By: Tupaki Desk | 1 May 2021 10:30 AM GMTటీటీడీ మరో కీలక నిర్ణయం. బ్రిటీష్ కాలం నాటి సాంప్రదాయంకు టిటిడి శ్రీకారం చుట్టింది. దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్ధంగా సాగు చేసిన బియ్యంతో నేటి నుండి నైవేద్యం తయారు చేసి శ్రీవారికి సమర్పించనుంది. స్వామి వారి నైవేద్యంకు కావాల్సిన బియ్యంను అందజేసిన విజయరాం అనే భక్తుడు. ఏడాదిలో రోజుకో రకం చొప్పున 365 రకాల బియ్యంతో చేసిన ప్రసాదాన్ని స్వామి వారికి నివేదించనున్నారు. టిటిడి కావాల్సిన బియ్యం అందితే భవిష్యత్తులో రైతుల వద్ద నుండి బియ్యంను నేరుగా కొలుగోళ్ళు చేసెందుకు టిటిడి భవిష్యత్ కార్యచరణ రూపోందించనుంది.. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంకు ప్రతినిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడి దర్శనార్ధం దేశ,విదేశాల నుండి వస్తుంటారు. గంటల తరబడి వేచి ఉండి క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్యమంగళ స్వరూపం కోసం పరితపించి పోతుంటారు.
అందుకే శ్రీవారి ఆలయంలోని నైవేద్య పోటులో సాంప్రదాయబద్దంగా తయారు చేసిన వివిధ రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తుంటారు అర్చకులు. పూటకొక్క వంటకంతో స్వామి వారికి ఎంతో భక్తి భావంతో అర్చకులు నైవేద్యాలు సమర్పిస్తూ..స్వామి వారిని సంతృప్తి పరుస్తారు. అయితే గతంలో ఆనవాయితీగా 365 రకాల దేశీయ వరి వంగడాల బియ్యంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించే వారు. ఆ తర్వాత ఈ పద్ధతి నిలిచిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని టిటిడి తీసుకున్న నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం మూడు పూటలా 195 కిలోల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు అర్చకులు.. దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్దంగా పండిన బియ్యంతో తయారు చేయబడిన నైవేద్యాన్ని సమర్పించే క్రతువు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రారంభంకానుంది. ఇందుకు కావాల్సిన దేశీయ వంగడాల బియ్యంను కృష్ణా జిల్లా, గూడూరు మండలం, పినగూడూరులోని సౌభాగ్య గోశాల, సేవ్ సంస్థ నిర్వాహకుడు ప్రకృతి వ్యవసాయవేత్త ఎం. విజయరాం ఈ సాంప్రదాయంకు తిరిగి రూపకల్పన చేశారు. గురువారం మధ్యాహ్నం కృష్ణా జిల్లా నుండి 15 రకాల ప్రకృతిసిద్ధ బియ్యంతో వాహనం తిరుమలకు చేరుకుంది.
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో దేశీయ వరి వంగడాలతో పండించిన బియ్యంతో శ్రీవారికి నైవేద్యం సమర్పించాలని రైతు విజయరామ్ టిటిడి ఛైర్మన్, ఈవోను సంప్రదించారని టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మొదటగా 10 రోజుల పాటు స్వామివారికి నైవేద్యం పెట్టే అన్నప్రసాదాల తయారీకి గానూ 2,200 కిలోల బియ్యం, కూరగాయలు, అరటిపండ్లు, బెల్లం, 15 కిలోల దేశీయ ఆవు నెయ్యి అందించారని తెలిపారు. ఈ బియ్యంలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. శుక్రవారం నుంచి ఈ బియ్యంతో తయారు చేసిన అన్నప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పారు. ఈ బియ్యం కావాల్సిన మోతాదులో దొరికితే రైతుల నుండే నేరుగా సేకరించి స్వామివారికి నైవేద్యంతో పాటు భక్తులకు అందించే అన్నప్రసాదాల తయారీకి కూడా వినియోగిస్తామన్నారు. ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పండించిన ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తులను వాడితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేథ్యం సమర్పించాం.. అద్భుతంగా ఉందని భక్తులు ప్రశంసించారన్నారు.. లడ్డూ ప్రసాదం కూడా ఆర్గానిక్ పదార్థాలతో ప్రయోగాత్మకంగా తయారు చేయించామని.. లడ్డూ ప్రసాదం కూడా చాలా రుచికరంగా వచ్చిందన్నారు. దీంతో లడ్డూ ప్రసాదం తయారికి ఆర్గానిక్ ముడిసరుకులు కోనుగోలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు.