Begin typing your search above and press return to search.
పేషెంట్ల వెంట స్మార్ట్ ఫోన్లు.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
By: Tupaki Desk | 2 Aug 2020 3:00 PM GMTకరోనా పేషెంట్లకు ఊరట కలిగించే ఒక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. పాజిటివ్ గా తేలిన తర్వాత వైద్యం కోసం ఆసుపత్రికి తరలించే పేషెంట్లు తమ వెంట స్మార్ట్ ఫోన్లు.. ట్యాబ్ లను తెచ్చుకునేందుకు రాష్ట్రాలు అనుమతించాలని కేంద్రం కోరింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పేషెంట్లను ఇప్పటికే అనుమతిస్తున్నారు. కొన్నిచోట్ల.. ఈ ఫోన్ల కారణంగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. ఆసుపత్రుల తప్పులు బయటకు వచ్చి కొన్ని ప్రభుత్వాలు ఇరుకున పడ్డాయి.
దీంతో.. అప్పటికప్పుడు పేషెంట్లు ఎవరు స్మార్ట్ ఫోన్లను అనుమతించకుండా నిర్ణయాలు తీసుకున్నాయి కొన్ని ప్రభుత్వాలు. ఈ నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. వెనక్కి తగ్గి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఇదిలా ఉంటే.. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు పాజిటివ్ పేషెంట్ల వెంట స్మార్ట్ ఫోన్లను.. ట్యాబులను ఆసుపత్రుల్లోకి అనుమతించటం లేదు.
దీనిపై పెద్ద ఎత్తున కేంద్రానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం తాజాగా ఒక సూచనను చేసింది. పేషెంట్లు తమతో పాటు స్మార్ట్ ఫోన్లు.. ట్యాబులు అనుమతించాలని.. దీంతో వారు తమ కుటుంబసభ్యులతోనూ.. మిత్రులతోనూ మాట్లాడేందుకు కుదురుతుందని పేర్కొన్నారు. రోగుల మానసిక సాంత్వనకు స్మార్ట్ ఫోన్లు.. ట్యాబులుసాయం చేస్తాయని కేంద్రం పేర్కొంది.
అయితే.. ఆసుపత్రుల్లోని సిబ్బంది ప్రోటోకాల్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్లు.. ట్యాబులను డిస్ఇన్ ఫెక్టింగ్ చేసేలా చూడాలని కోరింది. కోవిడ్ పేషెంట్లకు మానికస సమస్యలు.. అవసరాలను తీర్చేందుకు వీలుగా కౌన్సెలింగ్ సెషన్లు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోవాలని కోరటం గమనార్హం.