Begin typing your search above and press return to search.

ఆర్.ఎల్.ఐ.పి కి పర్యావరణ పరమైన అనుమతులు అవసరం లేదు!!

By:  Tupaki Desk   |   8 Aug 2020 11:10 AM GMT
ఆర్.ఎల్.ఐ.పి కి పర్యావరణ పరమైన అనుమతులు అవసరం లేదు!!
X
తెలంగాణ ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న ఏపీ చేపట్టిన ప్రతిష్టాత్మక పథకానికి కేంద్రం ఆమోదం లభించింది. అత్యంత రాజకీయ అంతరాష్ర్ట వివాదంగా మారిన ‘రాయలసీమ ఎత్తిపోథల పథకం’ అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇక సాఫీగా ముందడుగు వేసేందుకు వీలుచిక్కింది.

తెలంగాణ ప్రభుత్వం సహా కొందరు ఫిర్యాదులు చేయడంతో ఈ సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పర్యావరణ పరమైన అనుమతులు అవసరం లేదంటూ తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీ తేల్చిచెప్పింది. దీంతో ఈ ప్రాజెక్ట నిర్మణానికి ప్రధానమైన అడ్డంకి తొలగిపోయినట్లయిది.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అక్రమం అంటూ తెలంగాణకు చెందిన రాజకీయ పక్షాలు, మరికొందరు రాజకీయ నాయకులు కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు పర్యావరణ పరమైన అనుమతులు లేనందున నిర్మించరాదంటూ కోర్టుకెక్కారు. అదే సమయంలో రెండు రాష్ర్ట ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించాయి.

ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు దఫాలు విచారించి తొలిదశలో నిర్మాణం చేపట్టరాదంటూ స్టే విధించింది. ఆ తర్వాత స్టే ను ఎత్తివేసి తుది అనుమతులు కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని తేల్చి చెప్పింది.

ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీని నియమించింది. ఈ కమిటీలో రెండు రాష్ర్టాలకు సంబంధించిన అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. కమిటీ తొలుత విచారించి తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దానిపై ఏపి ప్రభుత్వం మరీ ముఖ్యంగా నీటి పారుదల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో తెలంగాణ అభ్యంతరాలను కొట్టేస్తూ ఏపి ప్రభుత్వ అభిప్రాయాలతో ఏకీభవించింది.

కమిటీ తన తుది నివేదికను తాజాగా పర్యావరణ మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉండే వెబ్ సైట్లో పొందుపరిచింది. దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ ను అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

రాయలసీమ ఎత్తిపోథల పథకం నిర్మాణంలో అడవులు, జంతుజాలం, పర్యావరణం పరమైన సమస్యలేమీ లేవని అందువల్ల పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతివ్వడం అనే సమస్య ఉత్పన్నం కాబోదని తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రక్రియ జరపకుండా నిలుపుదల చేయాలంటే వివిధ కోర్టుల్లో కేసుల్లో దాఖలయ్యాయి. అందులో నీటి లభ్యత, నీటి పై హక్కులతో పాటు పర్యావరణ పరమైన అంశాలను ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా పర్యవరణ అనుమతులు ప్రత్యేకంగా అవసరం లేదంటూ ఇచ్చిన కమిటీ నిర్ణయం వల్ల ఏపి ప్రభుత్వం తన పనులను ఏధావిధిగా కొనసాగించేందుకు సానుకూల వాతావరణం ఏర్పడింది.

రాష్ర్టాంలోనే అతిపెద్దదిగా భావించే ఈ ప్రతిపాదిత ఎత్తిపోతల పథకం పూర్తయితే వరద నీటితో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు వీలవుతుంది.