Begin typing your search above and press return to search.

కేంద్రం ఆలోచన మారింది.. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగరనుంది

By:  Tupaki Desk   |   2 Aug 2020 4:41 PM GMT
కేంద్రం ఆలోచన మారింది.. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగరనుంది
X
అంతర్జాతీయ విమాన‌ ప్ర‌యాణాలపై నిషేధం ప్రకటించిన రెండు రోజుల్లోనే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించడానికే మొగ్గు చూపింది. ప్రపంచంలో నలుమూలలా వైరస్ విస్తరించి ఉన్నపుడు వాటిపై నిషేధం అంత ప్రయోజనకరం కాదని భావించడంతో ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు.
తాజా ప్రకటన ప్రకారం... ఆగస్టు 8 నుంచి అంతర్జాతీయ విమాన సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రించనున్నారు. అయితే, మునుపటికి భిన్నంగా ప్రయాణాలు కొనసాగనున్నాయి. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది కేంద్రం. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రయాణ మార్గదర్శకాలను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండటానికి అంగీకరించిన వారిని మాత్రమే ప్రయాణాలకు అనుమతిస్తారు. ఈ క్వారంటైన్ సమయంలో మొద‌టి 7 రోజులు కేంద్రం నిర్దేశించిన క్వారంటైన్ కేంద్రంలో ఉండాలి. ఖర్చులు ఆయా ప్రయాణికులే భరించాలి. త‌దుప‌రి వారం రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి.

దీనిని ఉల్లంఘించకుండా చట్టబద్ధమైన స్వీయ ప్రకటన చేయాలి. ఈ స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ప్ర‌యాణానికి 72 గంట‌ల ముందుగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయితే గ‌ర్భిణిలు, ప‌దేళ్లలోపు పిల్ల‌లు, వృద్ధులు, వివిధ ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వారు ఎంచుకుంటే హోమ్ క్వారంటైన్‌కు అనుమ‌తిస్తారు. ఆరోగ్య సమస్యల విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనలకు లోబడి ఉంటే అనుమతిస్తారు. వీటితో పాటు దేశీయ విమాన ప్రయాణాలకు నిర్దేశించిన క‌రోనా నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాలు వీటికికూడా వర్తిస్తాయి. తమ వివరాలను న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ వెబ్ సైట్లోనే పొందుపరిచాలి.