Begin typing your search above and press return to search.

రాష్ట్రాల అప్పుల‌కు సంబంధించి కేంద్రం కొన్ని ప‌రిమితులు విధిస్తోంది.

By:  Tupaki Desk   |   10 May 2022 11:31 AM GMT
రాష్ట్రాల అప్పుల‌కు సంబంధించి కేంద్రం కొన్ని ప‌రిమితులు విధిస్తోంది.
X
తెలంగాణ రాష్ట్ర స‌ర్కారుకూ, బీజేపీకీ మ‌ధ్య దూరం మ‌రీ పెరుగుతోంది. ఇదే స‌మ‌యంలో ఏపీ స‌ర్కారు మాత్రం పెద్ద‌గా ఏమీ మాట్లాడ‌లేక‌పోతోంది. ఈ నేప‌థ్యంలో ఇవాళ కేంద్రం త‌ర‌ఫున ఎఫ్ఆర్బీఎం (Fiscal Responsibility and Budget Management)కు సంబంధించి కొన్ని విష‌యాలు వెల్ల‌డిలోకి వ‌చ్చాయి. అంటే దీని ప్ర‌కారం రాష్ట్రాల అప్పుల‌న్నీ కేంద్రం ప‌రిధిలోకి వ‌స్తాయి.

ఆ విధంగా బ‌డ్జెట్ బ‌య‌ట అప్పుల‌కూ లెక్క‌లు చెప్పాలి. అదేవిధంగా వీటిన‌న్నంటినీ ఎఫ్ఆర్బీఎం ప‌రిధిలోకి తీసుకువ‌చ్చిన వైనం కార‌ణంగా అనుచిత అప్పుల‌కు ఆస్కారం ఉండ‌దు. ఎప్ప‌టి నుంచో కేంద్రం చెబుతున్న విధంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు సంబంధించి అప్పులు తీసుకురావ‌డం ఇబ్బ‌డిముబ్బ‌డిగా వాటిని పంచేయ‌డం జ‌ర‌గ‌ని ప‌ని.

తాజాగా యాభై వేల కోట్ల‌కు పైగా రుణాలకు ప్ర‌తిపాద‌న‌లు చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం కు చుక్కెద‌రయింది.కేంద్రం మాదిరిగానే త‌మ‌కూ అప్పుల విష‌య‌మై స్వేచ్ఛ ఇవ్వాలి అని అడుగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వంకు అస‌లు నిబంధ‌న‌లు ఏవీ ప‌ట్ట‌డం లేదు అన్న విమర్శ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా రుణాల మంజూరులో కోత ఉంటే సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌భావం ఉంటుంది. అందుకే సుప్రీం కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం నుంచే ఎఫ్ఆర్బీఎం ప‌రిధిలోకి రాష్ట్రాలు చేస్తున్న అప్పుల‌ను తీసుకు రావాల‌ని యోచించింది. ఈ నేప‌థ్యంలో కొంత వివాదం రేగింది. ఇప్ప‌టికే తెలంగాణ స‌ర్కారు వివిధ కార్పొరేష‌న్ల పేరిట అప్పులు చేసింది. సంబంధిత ప్రాజెక్టులు పూర్త‌య్యాక సంబంధిత ఆర్థిక ఫ‌లాలు అందాక తిరిగి అప్పులు చెల్లించేందుకు యోచ‌న చేసింది.

ఈ నేప‌థ్యంలో కేంద్రం రుణ ప‌రిమితి కుదిస్తే ఇక‌పై కార్పొరేష‌న్ల‌కు రుణాలు అంద‌వు అన్న ఆందోళ‌న ఒక‌టి తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కుల నుంచి వినిపిస్తోంది. అందుకే రుణ‌ప‌రిమితిని కుదించ‌డం త‌గ‌దు..అని చెబుతోంది. దీనిపై ప్ర‌త్యేకంగా అసెంబ్లీ స‌మావేశం ఏర్పాటుచేసి కేంద్రంపై తిరుగుబాటు చేయాల‌ని యోచ‌న చేస్తోంది.

ఏపీ మాదిరిగా 30 వేల కోట్ల‌కు రుణ ప‌రిమితి విధిస్తే సంక్షేమం మ‌రియు అభివృద్ధి ప‌నులు ఆగిపోయే అవ‌కాశం ఉంద‌ని భ‌య‌ప‌డుతోంది. ఇదే స‌మ‌యాన తెలంగాణ రాష్ట్రంపై ఆర్థిక వివ‌క్ష చూపిస్తోంద‌న్న‌ది కేసీఆర్ వ‌ర్గాల వాద‌న. ఎఫ్ఆర్బీఎం కొత్త నిబంధ‌న‌ల‌ను వ్య‌తిరేకిస్తున్న కేసీఆర్..ఇక‌పై కేంద్రంపై త‌న పోరును మ‌రింత తీవ్ర‌త‌రం చేయ‌నున్నారు. కేంద్రం అనుస‌రిస్తున్న ప‌క్ష‌పాత, క‌క్ష పూరిత ధోర‌ణి ని నిలువ‌రించేందుకు సిద్ధం అవుతున్నారు.