Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   19 April 2021 4:30 PM GMT
వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం
X
దేశంలో కరోనా కల్లోలం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే దేశప్రజలందరికీ టీకాలు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యింది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్యతో వెంటనే టీకాల ఉత్పత్తి పెంచడానికి చర్యలు చేపట్టింది.

కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా జనాలు వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే టీకా డోసులు అయిపోయాయి. ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ లను పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లకు రూ.4500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం అంగీకారం తెలిపింది. ఇందులో 3వేల కోట్లు సీరమ్ సంస్థకు.. 1500 కోట్లు భారత్ బయోటెక్ కు ఇవ్వనున్నట్టు సమాచారం.

ఇందులో భాగంగా నెలకు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడానికి సీరమ్ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం నిధులు కావాలని కేంద్రప్రభుత్వానికి విన్నవించింది.

వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సాయం చేయడంతోపాటు వినూత్న విధానాలను కనుగొనడానికి వ్యాక్సిన్ తయారీదారులతో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందనీ సీరం సంస్థ తెలిపింది. జూన్ నెలలోగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాలని సీరమ్ సంస్థ తెలిపింది.