Begin typing your search above and press return to search.
తాజా అనుమతులు పొందిన కోర్బెవ్యాక్స్.. కోవోవ్యాక్స్!
By: Tupaki Desk | 29 Dec 2021 7:30 AM GMTమూడు.. నాలుగు రోజుల క్రితం అనుకోని రీతిలో జాతి జనుల్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ టీవీ తెరల మీదకు రావటం.. కీలక సందేశాన్ని ఇవ్వటం తెలిసిందే. కొన్ని వర్గాలకు బూస్టర్ డోసుల్ని కొత్త సంవత్సరం నుంచి వేయటంతో పాటు.. 14-18 ఏళ్ల మధ్యన ఉన్న వారికి వ్యాక్సిన్లు వేసేందుకు వీలుగా ప్రకటన చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగంగా సాగేందుకు వీలుగా భారత సర్కారు మరో రెండు కొత్త కొవిడ్ టీకాలకు ఓకే చెప్పేసింది.
ఫూణెకు చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవోవ్యాక్స్ వ్యాక్సిన్ ను షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతులు ఇస్తే.. హైదరాబాద్ లోని బయోలాజికల్ -ఈ కంపెనీ డెవలప్ చేసిన కోర్బెవ్యాక్స్ కు ఓకే చెప్పేసింది. వీటితో పాటు మోల్నుపిరవిర్ కు సైతం షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. దీంతో.. దేశంలో అనుమతులు పొందిన కొవిడ్ టీకాల సంఖ్య ఎనిమిదికి చేరుకున్నట్లైంది.
హైదరాబాద్ కు చెందిన బయొలాజికల్ -ఈ కంపెనీతో పాటు అమెరికాలోని టెక్సాస్ చిల్ర్డెన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవల్‌పమెంట్, హ్యూస్టన్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌ల సంయుక్త భాగస్వామ్యంలో ‘‘కోర్బెవ్యాక్స్’’ టీకాను డెవలప్ చేశారు. సీరం డెవలప్ చేసిన కొవిషీల్డ్ తో పోలిస్తే.. కోర్బెవాక్స్ టీకా.. వూహాన్ తొలి రకం కరోనాతో పాటు.. డెల్టా వేరియంట్ మీద చక్కటి ఫలితాన్ని ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.
30 కోట్ల కోర్బెవ్యాక్స్ డోసుల కోసం ఆగస్టులోనే కేంద్రం బయొలాజికల్ -ఈ సంస్థకు రూ.1500 కోట్ల అడ్వాన్స్ ను చెల్లించింది. 2022 ఫిబ్రవరి నాటికి నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 కోట్ల డోసులకు పెంచుతామని బీఈ సంస్థ చెప్పింది. ఇక.. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నోవావ్యాక్స్ తో డీల్ కుదుర్చుకుంది. ఈ టీకా ప్రభావశీలత 89.7 శాతంగా చెబుతున్నారు.
తమ కోవ్యాక్స్ ద్వారా 90 శాతం కంటే ఎక్కువ ప్రభావశీలత ఉన్న టీకాను ప్రజలకు అందిస్తున్నట్లుగా సీరం అధినేత అదర్ పూనావాలా వెల్లడించారు. తాజాగా లభించిన అనుమతులతో.. ప్రపంచ దేశాలకు ఎగుమతి అవకావం లభించనుంది. ప్రతి నెలా 15 కోట్ల కోవో వ్యాక్స్ డోసుల్ని తాము ఉత్పత్తి చేస్తామని చెబుతున్నారు. కొత్త సంవత్సరం వేళ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరో విడత చేపట్టే నేపథ్యంలో.. తాజాగా అనుమతులు పొందిన వ్యాక్సిన్లతో ప్రజలకు మరింత మేలు కలిగే అవకాశం ఉందంటున్నారు.