Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   13 May 2021 3:31 PM GMT
వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం
X
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో వ్యాక్సినేషన్‌ అధికంగా నిర్వహించాలని కేంద్రం భావించినా కూడా డిమాండ్‌ కు తగ్గట్లుగా మాత్రం వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. వ్యాక్సిన్ డోసుల తయారి పెంచేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కోవాగ్జిన్ మరియు కోవిషీల్డ్‌ ల డోసులు అధికంగా ఉత్పత్తి చేసేందుకు గాను కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏంటీ అంటూ ఇటీవలే కోర్టులు కూడా ప్రశ్నించాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా వ్యాక్సిన్‌ కొరత ను కేంద్రంపై నెట్టి వేస్తున్నాయి. దాంతో కేంద్రం వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు సిద్దం అయ్యింది.

భారత్‌ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్‌ ఫార్ములాను దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఔషద తయారీ సంస్థలతో పంచుకుని వాటిల్లో కూడా తయారీకి అనుమతి ఇచ్చేల కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో ఇతర సంస్థలు భాగస్వామ్యం అయితే పెద్ద ఎత్తున ఉత్పత్తి పెరుగుతుంది.

అలా తక్కువ సమయంలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పక్రియ పూర్తి అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై వెంటనే నిర్ణయం తీసుకుని భారత్‌ బయోటెక్ కు ఫార్ములా ఇతర సంస్థలకు ఇచ్చేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.