Begin typing your search above and press return to search.

వైసీపీలో ప‌ద‌వుల పండ‌గ‌.. ఆ ఎమ్మెల్సీలన్నీ వారీకే!

By:  Tupaki Desk   |   18 Feb 2021 5:30 PM GMT
వైసీపీలో ప‌ద‌వుల పండ‌గ‌.. ఆ ఎమ్మెల్సీలన్నీ వారీకే!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్సీ ప‌ద‌వుల పండ‌గ ప్రారంభ‌మైంది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్‌ విడుదల కానుం ది. నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీకి మార్చి 4గా ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. మార్చి 15న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఇదే రోజు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. అయితే.. ఈ ఆరు కూడా శాస‌న స‌భ్యుల ఎమ్మెల్సీ స్థానాలే కావ‌డం గ‌మ‌నార్హం.

దీనిని బ‌ట్టి.. ప్ర‌స్తుతం అసెంబ్లీలో వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న నేప‌థ్యంలో అన్ని ప‌ద‌వులు కూడా ఆ పార్టీకే ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మార్చి 29తో మ‌రో నాలుగు స్థానాలకుప‌ద‌వి కాలం పూర్తి కానుంది. ఇవ‌న్నీ కూడా టీడీపీకి చెందిన‌వే. గుండ‌మ‌ల తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకటచౌదరి, షేక్ మ‌హ్మద్‌ ఇక్బాల్‌ స్థానాల‌తో క‌లిపి మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

దీంతో వైసీపీలో ఒక్క‌సారిగా జోష్ పెరిగింద‌నే చెప్పాలి. ఇప్ప‌టి వ‌రకు ప‌ద‌వుల కోసంఎదురు చూస్తున్న‌వా రిలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క వైసీపీ నాయ‌కులు లేళ్ల అప్పిరెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌‌కు ఈ ద‌ఫా న్యాయం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. అదేవిధంగా తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం నుంచి గెలిచి హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ కుమారుడికి లేదాఆయ‌న స‌తీమ‌ణికి ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అదేవిధంగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు కూడా ఈ ద‌ఫా న్యాయం జరుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మిగిలిన ఒక్క స్థానాన్ని అంటే.. మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్ స్థానాన్ని ఆయ‌న‌కే తిరిగి రెన్యువ‌ల్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇలా మొత్తంగా ఆరు స్థానాల‌ను కీల‌క నేత‌ల‌కు కేటాయించ‌డం ద్వారా.. వైసీపీ దూకుడు పెంచ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.