Begin typing your search above and press return to search.
2-డీజీ ఔషధం ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..ఎంతంటే ?
By: Tupaki Desk | 28 May 2021 10:30 AM GMTదేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్. అయితే దేశంలో ఇప్పుడిప్పుడే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఇక భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో 2-డీజీ ఔషదాన్ని అభివృద్ధి చేసింది. తాజాగా ఈ ఔషదానికి కేంద్ర ప్రభుత్వం ధరను ఖరారు చేసింది. పొడి రూపంలో లభించే ఈ ఔషధం ఒక్కో సాకెట్ ధర రూ. 990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్ ధరకు అందించనున్నట్లు తెలిపింది.
అయితే ఆ డిస్కౌంట్ ఎంత అన్నది ఇంకా స్పష్టత రాలేదు. 2-డీజీ మందును హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి డీఆర్ డీవో ఆధ్వర్యంలో ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్’ అభివృద్ధి చేసింది. ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం ఎంతగానో పని చేస్తున్నట్లు డీఆర్ డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్ రూపంలో ఉండే ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 17న మొదటి విడత కింద 10వేల సాచెట్లను, మే 27న రెండో విడత కింద మరో 10వేల సాచెట్లను రెడ్డీస్ ల్యాబ్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ ఔషధాన్ని జూన్ మధ్యలో వాణిజ్యపరంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది. కాగా, కరోనా కట్టడికి ఏడాది పాటు శ్రమించి ఔషధాన్ని తయారు చేశారు. గతంలో దీన్ని క్యాన్సర్ కోసం తయారు చేశారు. అయితే శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కొవిడ్ కు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు.
కాగా, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ సంయుక్తంగా 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కొన్ని రోజుల క్రితం ఈ పౌడర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కాగా, అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే ఈ ఔషధానికి అనుమతి కూడా ఇచ్చింది. ఈ పౌడర్‌ను నీటిలో కలుపుకొని తాగాల్సి ఉంటుంది.