Begin typing your search above and press return to search.
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. ధరలు పెరగవట..!
By: Tupaki Desk | 2 Feb 2021 5:30 PM GMTకేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021-22లో కొత్తగా ‘అగ్రిసెస్’ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్ ఇలా పలు దిగుమతి చేసుకునే వస్తువులపై కేంద్రం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్(AIDC) విధించేందుకు సిద్ధమైన సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలో మద్యంపైనా కేంద్రం 100 శాతం అగ్రిసెస్‌ను ప్రకటించడంతో మందుబాబులు షాక్ తిన్నారు.
ఇప్పటికే కరోనా కారణంగా మద్యం ధరలు భారీగా పెరిగాయి. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ గాడితప్పడంతో ధరలు పెరిగాయిలే అని సర్ది చెప్పుకున్నారు. కానీ.. కేంద్రం అగ్రిసెస్ ను వర్తింపజేయడంతో.. మరోసారి ధరలు పెరుగుతాయని ఆందోళనకు గురయ్యారు.
అయితే.. తాజాగా ప్రతిపాదించిన అగ్రిసెస్ ద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఇంపోర్టెడ్ మద్యంపై 150 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్న కేంద్రం.. దాన్ని 50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, AIDC కలిసి మొత్తంగా 150 శాతానికే పరిమితం కానుందని కేంద్రం పేర్కొంది. కాగా.. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రానికి కూడా అధిక ఆదాయం వస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే.. దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. మొత్తానికి కొత్త పన్ను విధానం వల్ల మద్యం ధరల్లో ఎలాంటి పెరుగుదలా లేకపోవడంతో మందుబాబులు ఊపిరి పీల్చుకుంటున్నారు.