Begin typing your search above and press return to search.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం !

By:  Tupaki Desk   |   3 Dec 2020 5:30 PM GMT
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం !
X
కరోనా కారణంగా రద్దయిన విమాన సర్వీసులను ప్రభుత్వం క్రమ క్రమంగా పెంచుతోంది. కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలు రద్దయిన సర్వీసులను మే నెల 25న పున:ప్రారంభించారు. అందులో భాగంగా మొదటగా ఆయా దేశాల్లో చిక్కిపోయిన వారిని స్వస్థలాలకు తెచ్చేందుకు వందే భారత్ మిషన్ పేరిట సర్వీసులను ప్రారంభించింది. ఆ తరువాత 33 శాతంతో పర్మిషన్ ఇచ్చింది. జూన్ 26 నుంచి విడతల వారీగా అనుమతులు ఇస్తూ వస్తోంది. తాజాగా 80 శాతం పరిమితితో విమాన సర్వీసులను నడుపుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.

నేటి నుండి 80% పరిమితితో విమానాలు ప్రయాణిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. మే 25 నుంచి దేశీయ విమానయాన సేవలను ప్రారంభించిన ప్రభుత్వం... తొలుత 33% తో రన్ చేయాలని ఆదేశించింది. జూన్ 26 నుంచి విడతలవారీగా పరిమితిని పెంచింది. మే 25న 30 వేల మందికి సేవలందించిన విమానయాన రంగం ,నవంబర్ 30 నాటికి 2.52 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. తాజాగా 80 శాతం పర్మిషన్ తో రాకపోకలు పెరగనున్నాయి.