Begin typing your search above and press return to search.

భర్త సంపాదన తెలుసుకునే హక్కు భార్యకుంది !

By:  Tupaki Desk   |   19 Nov 2020 11:30 PM GMT
భర్త సంపాదన తెలుసుకునే హక్కు భార్యకుంది !
X
భర్త ఎంత సంపాదిస్తున్నాడో తెలుసుకునే హక్కు భార్యకు ఉన్నదని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ప్రకటించింది. తన భర్త ఆదాయ వివరాలను తెలియజేయాలని జోధ్‌ పూర్ ‌కి చెందిన రెహ్మత్‌ బాను ఆదాయపన్ను శాఖను సంప్రదించగా, వారు సమాచారమివ్వడానికి కుదరదు అని అన్నారు. దీనితో ఆమె సీఐసీకి అప్పీల్‌ చేసుకోగా, పిటిషన్‌ను విచారించిన కేంద్ర సమాచార కమిషన్, జోథ్‌పూర్‌ ఆదాయపన్ను శాఖకు 15 రోజుల్లోపు రెహ్మత్‌ కోరిన సమాచారమివ్వాలని ఆదేశాలు జారీచేసింది.

భార్యను మూడో వ్యక్తిగా భావిస్తూ సంపాదన గురించి తెలుపకుండా ఉండరాదని తెలిపింది. మూడో వ్యక్తి ఆదాయ సమాచార వివరాలు ఇవ్వడం కుదరదని, ఇది సమాచార హక్కు నిర్వచన పరిధిలోకి రాదని, ఆదాయ పన్ను శాఖ వాదనను సీఐసీ తిరస్కరించింది. ‘ఇది వ్యక్తిగత సమాచారమని, దీన్ని వెల్లడించడం కుదరదు’అని ఆమె భర్త తిరస్కరించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడిందని ఆమె న్యాయవాది రజక్‌ హైదర్‌ తెలిపారు.