Begin typing your search above and press return to search.
మంత్రులకు దొరకని ముఖ్యమంత్రి సామాన్యులకు దొరుకుతారు!
By: Tupaki Desk | 21 Jun 2021 4:30 AM GMTమంత్రి పదవి నుంచి పక్కన పెట్టి.. కేసులు నమోదు చేసి.. వేటు వేసేందుకు టైం కోసం వెయిట్ చేస్తున్న వేళ.. ఆఘమేఘాల మీద బీజేపీలోకి చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. గతానికి భిన్నంగా తన స్వరాన్ని పెంచారు. బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా.. పార్టీ మీద నిప్పులు చెరుగుతున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ హాట్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తాను ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉప ఎన్నికల్లో జన చైతన్యాన్ని ఆపటం నీ జేజమ్మ వల్ల కూడా కాదంటూ మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న యువకుడు ఉన్నాడని.. రాబోయే కాలంలో వారే కథానాయకులు అవుతారంటూ.. కేసీఆర్ తరచూ వాడే మాటను తనదైన శైలిలో మార్చి చెప్పారు ఈటల. అంతేకాదు.. 90 సీట్లు గెలిచినా కూడా మూడు నెలలు మంత్రులు లేకుండా కేసీఆర్ పాలించారని.. ఇది చీకటి పాలన అంటూ గతాన్ని గుర్తు చేసి గయ్యిమన్నారు.
మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఒక సామాన్యుడికి మాత్రం అందుబాటులో ఉంటారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘మాకు కూడా ముఖ్యమంత్రి దొరికే వాడు కాదు. కానీ ఒక సామాన్యుడికి ఆయన దొరుకుతాడు. మామూలు మనిషి వచ్చి వినతిపత్రం ఇవ్వగానే టీవీల్లో ప్రచారం చేయించి నాపై కుట్ర చేశారు. మొదట్లో ఈటల రాజేందర్ కు మంత్రి పదవి రాదని.. సొంతపత్రికలో కేసీఆర్ రాయించారు. వైద్య ఆరోగ్య శాఖ ఇస్తే రోజు నెగిటివ్ వార్తలు వస్తాయని భావించారు. కాలం కలిసి వచ్చింది. పని చేసే వారికి ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యానించారు.
తన నియోజకవర్గంలో ఓట్లు గల్లంతు చేయటానికి తహసీల్దార్లను బదిలీలు చేసినట్లు ఆరోపించిన ఈటల.. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మానుకోట ఉద్యమకారులపై దాడులు చేసిన వారిని కేసీఆర్ తన వద్దన పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘‘2023 తర్వాత నీ ప్రభుత్వం రాదు. రాబోయే రోజుల్లో నీ నీచపు చరిత్రకు చరమగీతం పాడేది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలే. నీకు దమ్ముంటే రా. ప్రజాస్వామ్యంలో తేల్చుకుందాం. నా ఆత్మ గౌరవమంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం’’ అని వ్యాఖ్యానించారు.