Begin typing your search above and press return to search.
పిల్లాడి పేరు ABCDEFGHIJK .. తండ్రి ఎందుకు పెట్టాడంటే !
By: Tupaki Desk | 30 Oct 2021 11:30 PM GMTసాధారణంగా పిల్లలకు పేర్లు పెట్టేందుకు తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో తెలిసిందే. జన్మరాశులు, నక్షత్రాలు, రోజులకు తగినట్లుగా పేరు పెట్టడమంటే చిన్న విషయం కాదు. అయితే, ఇటీవల పిల్లలకు పెద్దల పేర్లు పెట్టడం మానేసి నోరు తిరగని సరికొత్త పేర్లను పెడుతున్నారు. ఇతర దేశాల నుంచి కూడా కొన్ని పేర్లను అరువు తీసుకుంటున్నారు. అయితే, ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి.. పేరు కోసం తంటాలు పడటం నా వల్ల కాదంటూ తన కొడుకు వింత పేరు పెట్టాడు.
ABCDEFGHIJK గా నామకరణం చేశాడు. ఈ పేరు పెట్టడం నిజం. మొదట్లో స్కూల్ నిర్వాహకులు కూడా ఇది జోకేమో అనుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ చూపించిన తర్వాత వారు షాక్ అయ్యారు. ఇండోనేషియాలోని సౌత్ సుమత్రా ప్రావిన్స్‌లోని మురా ఎనిన్‌లో ఇటీవల స్కూల్ పిల్లలకు కరోనావైరస్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా అధికారులు ఓ బాలుడి పేరు చూసి ఆశ్చర్యపోయారు. 12 ఏళ్ల ఆ బాలుడి పేరు ABCDEFGHIJK Zuzu అని తెలుసుకుని షాకయ్యారు. ఆ పిల్లాడు జోకేస్తున్నాడేమో అని అధికారులు తొలత భావించారట. అతడి తండ్రికి ఫోన్ చేయగా అసలు విషయం తెలిసింది.
ఆ బాలుడు తన మిత్రుల దగ్గర ఇవన్నీ అక్షరాలు చదవడానికి బదులుగా ఓ షార్ట్ ఫామ్‌ను ఎంచుకున్నాడు. సింపుల్‌గా అడెఫ్‌గా పిలిపించుకుంటున్నాడు.జూజు స్కూల్ ఐడెంటీ కార్డుపైన, అతడి స్కూల్ యూనిఫామ్ ట్యాగ్ కూడా ABCDEFGHIK Zuzu అనే ఉంది. అతడి తండ్రికి క్రాస్‌వర్డ్ పజిల్స్‌పై ఉన్న అభిమానం వల్లే తన కొడుకుకు ఆ పేరు పెట్టాడట. అంతేగాక, అతడికి రచయిత కావాలనే కోరిక బాగా ఉండేదని, అక్షరాలపై ఉన్న మమకారంతో అతడు తన అబ్బాయికి ఆ పేరు పెట్టాడని బంధువులు అంటున్నారు. అయితే, జూజు అనేది మాత్రం అతడి తల్లిదండ్రుల పేర్ల నుంచే వచ్చింది. తండ్రి జు, తల్లి జుల్ఫామీ పేర్లలోని ముందు అక్షరాలను అతడి పేరులో చేర్చారు. దీంతో అంతా జూజు అని పిలుస్తున్నారు. కేవలం ABCDEFGHIK అనే మాత్రమే పెట్టి ఉంటే.. మాత్రం అతడి పేరు పిలిచేందుకు నానా తంటాలు పడేవారు. అయితే, జూజు పేరును K వరకు మాత్రమే ఎందుకు పెట్టాడనే అనుమానం రావచ్చు. అయితే దానికి కూడా ఒక షాకింగ్ కారణం ఉంది. తనకు తర్వాత పుట్టిన పిల్లలకు NOPQ RSTUV, WXYZ అని పేరు పెట్టాలని అనుకున్నాడు.