Begin typing your search above and press return to search.
అమెరికాకు వెళ్లి చదివే విద్యార్థుల్లో చైనీయులు మొదటిస్థానం.. భారతీయులది..?
By: Tupaki Desk | 21 March 2021 1:30 PM GMTడాలర్ డ్రీమ్స్ ను తీర్చుకునేందుకు రెండు మార్గాలుగా చెప్పటం తెలిసిందే. ఉద్యోగం సాధించి వెళ్లటం ఒకటైతే.. రెండోది ఉన్నత విద్యను అభ్యసించటం ద్వారా.. అక్కడి ఉపాధి అవకాశాల్ని చేజిక్కించుకోవటం. రోజులు గడుస్తున్న కొద్దీ అమెరికాకు వెళ్లి చదువుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలోని పలు దేశాల వారు అమెరికాకు వెళ్లి చదువుకుంటున్నా.. రెండు దేశాల వారే ఎక్కువన్న విషయం తాజాగా వెల్లడైన నివేదిక స్పష్టం చేస్తోంది.
యూఎస్ ఇమ్మిగ్రేషన్.. కస్టమ్స్ ఎన్ ఫోర్సుమెంట్లో భాగంగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కు సంబంధించిన వార్షిక నివేదిక వెల్లడైంది. దీని ప్రకారం అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో 47 శాతం మంది చైనీయులు.. భారతీయులేనని వెల్లడించారు. కరోనా కారణంగా కొత్తగా కాలేజీల్లో ఆడ్మిషన్లు తీసుకునే వారి సంఖ్య భారీగా తగ్గినట్లుగా చెబుతున్నారు. 2020లో అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థులు 5.90లక్షల మంది రెండు దేశాలకు చెందిన వారేనని చెబుతున్నారు. మొత్తం విద్యార్థుల్లో దాదాపు 48 శాతం మంది చైనా.. భారత్ కు చెందిన వారేనని చెబుతున్నారు.
చైనా విద్యార్థులు 3.82లక్షల మంది ఉంటే.. భారత్ కు చెందిన విద్యార్థులు 2.07లక్షల మంది. ఈ రెండు దేశాల తర్వాత అమెరికాకు వెళ్లి చదువుకునే విదేశీ విద్యార్థుల్లో దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలుస్తుంది. ఈ దేశానికి చెందిన 68,217 మంది గత ఏడాది ఆడ్మిషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. తర్వాతి స్థానాల్లో సౌదీ ఆరేబియా.. కెనడా.. బ్రెజిల్ దేశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. 2019తో పోలిస్తే.. 2020లో చైనా.. భారత్ నుంచి అమెరికాకు విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గినట్లుగా గుర్తించారు. దీనికి కారణం కరోనానేనని చెబుతున్నారు.