Begin typing your search above and press return to search.
చైనా కుట్రలు బట్టబయలు.. పక్కా ఆధారాలివీ
By: Tupaki Desk | 21 Dec 2020 11:50 AM GMTకరోనా వైరస్ ను దాచిపెట్టిన ప్రపంచాన్ని మోసం చేసిన చైనా.. పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైందని తాజాగా బయటపడిన సంచలన విషయాల ద్వారా వెల్లడైంది. చైనా ఉద్దేశపూర్వకంగానే నిజాలను దాచిపెట్టిందని ఓ నివేదిక బయటపెట్టింది.
చైనా దేశంలో జరిగిన వైరస్ వ్యాప్తి.. దాని పరిణామాలపై సోషల్ మీడియాలో ఎటువంటి సమాచారం పంచుకోరాదని వైరస్ బయటపడ్డ తొలినాళ్లలో చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ప్రభుత్వం ఆదేశించిందని.. ఇందుకోసం కొంతమంది నిపుణులు, సంస్థలను నియమించి వారికి భారీ మొత్తాన్ని చెల్లించిన వైనం తాజాగా ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ మేరకు ఆధారాలను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్, ప్రోపబ్లికా సంస్థలు బయటపెట్టాయి.
చైనా ప్రభుత్వం మొత్తం 1800 మెమోలు, 3200కు పైగా ఉత్తర్వులను వెలువరించి కరోనా వైరస్ బయటపడకుండా జాగ్రత్త పడిందన్న దారుణ విషయాన్ని మీడియా సంస్థలు బయటపెట్టాయి.
చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉన్న వార్తలు, కథనాలు, సమాచారాన్ని భారీ ఎత్తున నియంత్రించాలని.. ప్రత్యేకంగా నియమించిన యంత్రాంగాన్ని చైనా ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో కొన్ని మీడియా సంస్థలు ఉండడం విశేషం.
కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎలాంటి సమాచారం ట్రెండింగ్ లో కారాదని.. చైనీయులు హీరోగా పిలుచుకున్న డాక్టర్ లీ వెన్ లియాంగ్ మరణవార్తను సైతం దాచిపెట్టే ప్రయత్నం చైనా చేసిందని మీడియా సంస్థలు బయటపెట్టాయి. జనవరి ప్రారంభంలో కరోనా వైరస్ ప్రబలుతోందని తోటి వైద్యులను హెచ్చరించిన లీ.. ఫ్లూ కాదని.. ఇది వైరస్ అని ప్రపంచ అత్యవసర పరిస్థితి తప్పదంటూ హెచ్చరించారు. దీనికి సీరియస్ అయిన చైనా ప్రభుత్వం లీను అరెస్ట్ చేసి చైనా ప్రభుత్వం జైలుకు పంపింది. తర్వాత అదే నిజమై ప్రపంచాన్ని కరోనా కబళించింది. ఆ డాక్టర్ కూడా కరోనాకే బలి అయ్యాడు.
దీన్ని బట్టి చైనా భారీ మోసానికి పాల్పడిందని.. భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని తేలింది.