Begin typing your search above and press return to search.
కరోనా: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితమేనా?
By: Tupaki Desk | 12 Sep 2020 11:30 PM GMTప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ టీకా ప్రయోగాల్లో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక వలంటీర్ టీకా తీసుకున్నాక అస్వస్థతకు గురికావడంతో కరోనా వైరస్ చివరి దశ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేశారు. ఇది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా అనిపిస్తోంది.
అయితే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా సంస్థ ఇలాంటి విరామం మామూలే అంటోంది. వలంటీర్ కు అనారోగ్యం కారణం అయ్యి ఉండవచ్చని అనుమానిస్తోంది. దీంతో కరోనా వ్యాక్సిన్ ఫెయిల్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ రేసులో ఆక్స్ ఫర్డ్ టీకాపైనే ఆశలు పెంచుకున్నారు. ఇదిప్పుడు ట్రయల్స్ లో వికటించి ఆలస్యం కావడం అందరినీ నిరుత్సాహ పరిచింది. బ్రిటన్ లోని ఒక వలంటీర్ లో తీవ్రమైన రియాక్షన్ కనిపించడంతో వ్యాక్సిన్ తయారీలో విరామం వచ్చింది. ఆ వలంటీర్ ను ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో టీకా తయారీకి విరామం ఏర్పడిందని ఆస్ట్రాజెనెకా తెలిపింది. భారత్ లోనూ ఈ టీకా ట్రయల్స్ నిలిచిపోయాయి.
ఇలా వ్యాక్సిన్ ట్రయల్స్ లో జరగడం మామూలేనని నిపుణులు చెబుతున్నారు. యూకే, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లో 30వేల మందిపై ఆక్స్ ఫర్డ్ టీకా మూడో దశ ప్రయోగాలు నడుస్తున్నాయి. వీటన్నింటిని ఆపేశారు. ఓ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న పలువురు వలంటీర్లకు టీకా వికటించడంతో దానిని పరిశీలిస్తున్నారు.