Begin typing your search above and press return to search.

విశాఖ అభివృద్ధి పై సీఎం కీలక నిర్ణయం .. దాన్ని కలిపేస్తారట !

By:  Tupaki Desk   |   10 April 2021 9:30 AM GMT
విశాఖ అభివృద్ధి పై సీఎం కీలక నిర్ణయం .. దాన్ని కలిపేస్తారట !
X
విశాఖపట్నం..గతంలో ఏపీలో ఒక నగరం మాత్రమే. కానీ, ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం ను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత దాని రూపురేఖలే మారిపోయాయి. విశాఖ మీద ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో విశాఖ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యాచరణను రూపకల్పన చేసింది. పరిపాలనా రాజధాని అన్న తర్వాత అన్ని హంగులతో కలగలిపి నగరం ముస్తాబు కావాలి కాబట్టి , ఆ తరహా నిర్మానికి సీఎం జగన్ సముఖంగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేశారు. మరికొన్ని పనులకి శ్రీకారం చుట్టబోతున్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్న భోగాపురం నుంచి విశాఖ దాకా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించిందట. అంతర్జాతీయ విమానాశ్రయంకి , విశాఖపట్నంకి మధ్య ప్రధాన రహదాని నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారని చర్చించుకుంటున్నారు. అలాగే, బైపాస్ రోడ్లు, మెట్రో ట్రామ్ వ్యవస్థలతో అద్భుతమైన ప్రణాళికలను కూడా రూపకల్పన చేయబోతున్నారు. విశాఖ నుంచి భోగాపురానికి యాభై కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ అభివృద్ధి పనులు చేపడితే రానున్న రోజుల్లో విశాఖ మరింతగా ప్రగతిపధంలో సాగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు తగిన కార్యాచరణతో సిద్ధం కావాలని తాజా సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే , భోగాపురం ఎయిర్‌ పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బైపాస్‌ మార్గాల నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. మెట్రో, ట్రాం రైలు వ్యవస్థలను ఇంటిగ్రేట్‌ చేసుకుంటూ ప్రణాళికలు ఉండాలన్నారు. అలాగే బీచ్‌రోడ్డును కూడా సర్వాంగ సుందరంగా, చక్కటి పర్యాటక ప్రాంతంగా నిలిచేలా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ బిమల్‌ పటేల్‌ కూడా పాల్గొన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణమవుతున్న దృష్ట్యా.. ఆ విమానాశ్రయానికి, నగరానికి మధ్య ఉన్న ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు.