Begin typing your search above and press return to search.
అక్కడి సీఎంలు సచివాలయం వెళతారు.. మనం వెళతామా ఏంది?
By: Tupaki Desk | 23 Oct 2019 5:33 AM GMTపోల్చుకుంటే అన్ని విషయాల్లోనూ పోలిక ఉండాలి. కానీ.. నచ్చిన విషయాల్లో పోలిక.. నచ్చని విషయాల్లో వాళ్లతో మనకెందుకు? లాంటి తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆయన నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు అనవసర చర్చగా మారటమే కాదు.. పలు విమర్శలకు తావిచ్చేలా ఉంటున్నాయి. 48వేల మంది కార్మికులు సమ్మే చేస్తుంటే.. ఫలానా టైంలోపల విధుల్లో చేరకపోతే.. మీ ఉద్యోగాలు పోతాయని అనటమే కాదు.. సెల్ప్ డిస్మిస్ అయ్యారంటూ సంచలన వ్యాఖ్య చేయటం కేసీఆర్ కే చెల్లింది.
ఆర్టీసీని.. రూట్లను ప్రైవేటు పరం చేయటానికి పూర్తి అధికారం ఇస్తూ మోడీ సర్కారు చట్టం చేసిందని.. దానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు మాట్లాడటం ఏమిటన్నది కేసీఆర్ తాజా క్వశ్చన్. అంతేకాదు.. మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసింది కదా? అని ప్రశ్నిస్తున్నట్లు మీడియాలో వచ్చింది.
తనకు తోచిన విషయాల్లో ఇలాంటి పోలిక తీసుకొచ్చే కేసీఆర్ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఆర్టీసీ విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పాలసీ ఉంటుంది. మధ్యప్రదేశ్.. మోడీ సర్కారు గురించి మాట్లాడే కేసీఆర్.. తన మిత్రుడైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో చేర్చేస్తూ నిర్ణయం తీసుకుంది కదా? దాన్ని ఎందుకు ప్రాతిపదికగా తీసుకోకూడదు.
కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు మించిన రీతిలో తమ ప్రభుత్వం పథకాల్ని రూపొందిస్తుందని చెప్పుకునే కేసీఆర్.. ఆర్టీసీ విలీనం విషయంలో మరకల్ని ఉదాహరణగా చూపే బదులు మెరుపుల్ని ఎందుకు చూపరు? అన్నది క్వశ్చన్. అంతదాకా ఎందుకు? దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా ఆరేళ్లుగా సీఎంగా ఉండి సచివాలయానికి వెళ్లని వైనం కనిపించదు. మరి.. కేసీఆర్ ఆ విషయాన్ని ఉదాహరణగా ఎందుకు తీసుకోరు?
తనకు నచ్చలేదన్న ఉద్దేశంతో అప్పటికే ఉన్న సీఎం అధికారిక నివాసానికి బదులుగా తన టేస్ట్ కు తగ్గట్లు కొత్త భవనాన్ని నిర్మించుకొని అందులో ఉండటం లేదా? అంతేనా.. తన నమ్మకాలకు తగ్గట్లు లేని సచివాలయాన్ని కూల్చేసి.. కొత్తది నిర్మించుకోవట్లేదు? దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా ఇలా చేయట్లేదు? తన చర్యను విపక్షాలు కూడా సమర్థించటం లేదు కదా? మరి.. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల్ని కేసీఆర్ ఎందుకు ఫాలో కారు? అన్న ప్రశ్నకు కేసీఆర్ మాత్రమే కాదు గులాబీ నేతలు సైతం సమాధానం చెప్పేందుకు తెగ ఇబ్బందికి గురి అవుతున్నారు. ఆ అవస్థలు లేకుండా.. కొన్ని పోలికల్ని తేకుండా ఉంటే సరిపోతుంది కదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.