Begin typing your search above and press return to search.

కర్ర పట్టుకొని తాట తీసిన కలెక్టర్.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   19 April 2021 1:30 AM GMT
కర్ర పట్టుకొని తాట తీసిన కలెక్టర్.. ఎందుకో తెలుసా?
X
కరోనా 2.0 ఇప్పుడు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న వేళ.. జాగ్రత్తలు తీసుకోవాలని.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని చెబుతున్నా.. ఎవరికి వారు.. వారి పనుల్ని ఆపని దుస్థితి. ఇలాంటి వేళ.. యాక్టివ్ గా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఇందుకు భిన్నంగా కొందరు అధికారులు మాత్రం చొరవ తీసుకొని కొత్త తరహా చర్యల్ని చేపట్టి.. ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా అలాంటి పనే చేశారు ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి అనుపమ కుమార్ సాహా. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని మూసేశారు. ఏపీ నుంచి వస్తున్న వారిని.. తగిన పత్రాలు లేకుండా రాష్ట్రంలోని అనుమతించటం లేదు. అందుకు భిన్నంగా నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని.. ముఖానికి మాస్కులు లేకుండా ఉన్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. చేతిలో కర్ర పట్టుకున్న కలెక్టర్ అనుపమ కుమార్.. సబ్ కలెక్టర్ సంగ్రాం కేసరితో కలిసి ఉల్లంఘనుల తాట తీస్తున్నారు.

సాధారణంగా.. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు ఒడిశాకు వెళ్లే వారికి సరిహద్దు ప్రాంతమైన పర్లాకిమిడి వద్దకు రాకపోకలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. కేసులు పెరుగుతున్న వేళ.. ఒడిశాలోకి రానివ్వటం లేదు. అయితే.. రోజువారీగా వచ్చి పోయేవారు.. సకరోనా 2.0 ఇప్పుడు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న వేళ.. జాగ్రత్తలు తీసుకోవాలని.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని చెబుతున్నా.. ఎవరికి వారు.. వారి పనుల్ని ఆపని దుస్థితి. ఇలాంటి వేళ.. యాక్టివ్ గా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఇందుకు భిన్నంగా కొందరు అధికారులు మాత్రం చొరవ తీసుకొని కొత్త తరహా చర్యల్ని చేపట్టి.. ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా అలాంటి పనే చేశారు ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి అనుపమ కుమార్ సాహా. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని మూసేశారు. ఏపీ నుంచి వస్తున్న వారిని.. తగిన పత్రాలు లేకుండా రాష్ట్రంలోని అనుమతించటం లేదు. అందుకు భిన్నంగా నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని.. ముఖానికి మాస్కులు లేకుండా ఉన్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. చేతిలో కర్ర పట్టుకున్న కలెక్టర్ అనుపమ కుమార్.. సబ్ కలెక్టర్ సంగ్రాం కేసరితో కలిసి ఉల్లంఘనుల తాట తీస్తున్నారు.

సాధారణంగా.. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు ఒడిశాకు వెళ్లే వారికి సరిహద్దు ప్రాంతమైన పర్లాకిమిడి వద్దకు రాకపోకలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. కేసులు పెరుగుతున్న వేళ.. ఒడిశాలోకి రానివ్వటం లేదు. అయితే.. రోజువారీగా వచ్చి పోయేవారు.. సరిహద్దు గ్రామాలతో సంబంధాలు ఉన్న వారికి అధికారుల తీరుతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఏపీ బస్సుల్ని సైతం సరిహద్దుల వద్ద ఉన్న చెక్ పోస్టు దగ్గరే ఆపేసి.. తమ రాష్ట్రంలోకి రావాలనుకుంటే నడుచుకుంటూ రావాలని చెబుతున్నారు. దీంతో.. లగేజ్ మోసుకుంటూ రావటం ఇబ్బందికరంగా మారింది. ఏమైనా.. జిల్లా కలెక్టర్ ఒకరు.. ఇలా కర్ర పట్టుకొని చర్యలు చేపట్టిన వైనం సంచలనంగా మారింది.

రిహద్దు గ్రామాలతో సంబంధాలు ఉన్న వారికి అధికారుల తీరుతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఏపీ బస్సుల్ని సైతం సరిహద్దుల వద్ద ఉన్న చెక్ పోస్టు దగ్గరే ఆపేసి.. తమ రాష్ట్రంలోకి రావాలనుకుంటే నడుచుకుంటూ రావాలని చెబుతున్నారు. దీంతో.. లగేజ్ మోసుకుంటూ రావటం ఇబ్బందికరంగా మారింది. ఏమైనా.. జిల్లా కలెక్టర్ ఒకరు.. ఇలా కర్ర పట్టుకొని చర్యలు చేపట్టిన వైనం సంచలనంగా మారింది.