Begin typing your search above and press return to search.
అమెరికాలో భారతీయులపై ఆ దిగ్గజ కంపెనీ వివక్ష!
By: Tupaki Desk | 10 Oct 2022 9:30 AM GMTఅమెరికాలో భారతీయులను తమ కంపెనీలో నియమించుకోవడానికి టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వివక్ష చూపుతోందని మాజీ రిక్రూటర్ ఒకామె ఆరోపించడం కలకలం రేపుతోంది. ఈ విషయంలో కంపెనీ తీరును చూసి తాను తీవ్ర షాక్‌కు గురయ్యానని ఆమె చెబుతోంది. అంతేకాకుండా ఈ విషయంలో న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టును ఆమె ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌పై మాజీ రిక్రూటర్ చేసిన కేసును కొనసాగించవచ్చని న్యూయార్క్‌లోని ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ కేసును కొట్టి వేయాలని ఇన్ఫోసిస్, దాని ఎగ్జిక్యూటివ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను గత నెల సెప్టెంబర్‌లో న్యాయమూర్తి జె.పాల్ ఓట్‌కెన్ కొట్టేశారు.
కాగా మాజీ రిక్రూటర్ జిల్ ప్రీజీన్ కనీసం 12 మంది నుంచి ఈ విషయాన్ని విన్నానని.. ఈ 12 మంది రిక్రూటర్లు ఇన్ఫోసిస్ తరఫున అమెరికాలో అదనపు కన్సల్టెంట్‌లను నియమించుకోవడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. దీంతో వారి తీరుపై తాను దిగ్భ్రాంతికి గురయ్యానని కోర్టుకు వివరించారు.
అంతేకాకుండా ఒక మహిళగా తాను వ్యక్తిగతంగా వివక్షను ఎదుర్కొన్నానని జిల్ ప్రీజీన్ ఆవేదన వ్యక్తం చేవారు. తన వయస్సు కారణంగా న్యూయార్క్‌లో ఉన్న ఉద్యోగం నుండి తొలగించబడ్డానని తెలిపారు.
ఇన్ఫోసిస్ ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు.. తాను మహిళ కావడం, తన వయసును బట్టి తనపై వివక్షపై చూపారని జిల్ ప్రీజీన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తగిన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తెలిపారు.
కాగా అమెరికాలో ఇన్ఫోసిస్‌కు ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు, పార్టనర్స్‌ను నియమించడంలో సహాయపడటానికి 2018లో ప్రీజీన్ నియమించబడ్డారు. అయితే 2019లోనే ఆమెను తొలగించారు. దీంతో తన స్థానంలో వయసు, అర్హతలు తక్కువ ఉన్నవారిని నియమించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా 50 ఏళ్లకు దగ్గరగా ఉన్నవారు లేదా అంతకుమించి ఉన్నవారు, ఇంట్లో పిల్లలతో ఉన్నవారిని ఉద్యోగాలకు ఎంపిక చేయకూడదని తనకు సూచించారని ఆరోపించారు.
తాను ఇన్ఫోసిస్‌లో పనిచేసినప్పటికీ ఐటీ అసోసియేట్స్ ఇంక్ అనే కంపెనీ ద్వారా ఉద్యోగంలో చేరానని.. వారి ద్వారానే జీతాలు తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా భారతీయ మూలాలున్న వారిని కూడా ఉద్యోగాల్లో చేర్చుకోకూడదని సూచనలు జారీ చేశారని ఆరోపించారు. 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిని, ఇంట్లో పిల్లలు లేని మహిళలను మాత్రమే నియమించుకోవడానికి మొగ్గు చూపుతున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని ఆరోపించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.