Begin typing your search above and press return to search.
మోడీకి భారీ హగ్ ఇస్తున్నట్లు చెప్పిన కాంగ్రెస్ నేత
By: Tupaki Desk | 10 Nov 2019 8:00 AM GMTరాజకీయాల్ని తరచూ రొచ్చుతో పోలుస్తుంటారు. అందుకు భిన్నంగా ప్రత్యర్థి సైతం హగ్ ఇచ్చేలా పాలిటిక్స్ చేయటం ప్రధాని మోడీకే సాధ్యమేమో. ఎక్కడిదాకానో ఎందుకు.. నిండు పార్లమెంటులో ప్రధానికి చిన్నపాటి హగ్ ఇచ్చేసి కాంగ్రెస్ అధినేతగా ఉన్న రాహుల్ అప్పట్లో సంచలనంగా మారారు. అయితే.. ఆయన హగ్ ను మోడీ మాష్టారు ఎంతలా ఎటకారం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి.
తాజాగా రాహుల్ ను స్ఫూర్తిగా తీసుకున్నారేమో కానీ.. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్.. మాజీ క్రికెటర్ కమ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తాజాగా ప్రధానికి భారీ హగ్ ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణం పూర్తి అయిన వేళ.. సిద్దూ భావోద్వేగానికి గురయ్యారు.
దేశ విభజన సమయంలో జరిగిన రక్తపాతమనే గాయానికి కర్తార్ పూర్ కారిడార్ అనేది ఆయింట్ మెంట్ పూత లాంటిదని వ్యాఖ్యానించారు. సిక్కుల కలను నెరవేర్చినందుకు రెండు దేశాల ప్రధానులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా కారిడార్ నిర్మాణానికి చొరవ చూపించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
అదే సమయంలో ప్రధాని మోడీ పైనా ప్రశంసల వర్షాన్ని కురిపించారు. కేవలం పది నెలల వ్యవధిలో కారిడార్ నిర్మాణం పూర్తి చేయటానికి ప్రధాని ప్రదర్శించిన చొరవ మర్చిపోలేమన్నారు. సిక్కుల కలను ప్రధాని తీర్చారని.. తనకు మోడీకి మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు కానీ కారిడార్ కలను నెరవేర్చినందుకు మున్నాభాయ్ ఎంబీబీఎస్ స్టైల్లో ఒక హగ్ ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. తన జీవితాన్ని గాంధీ కుటుంబానికి అంకితం చేసినా.. తన రాజకీయ ప్రత్యర్థి మోడీకి మాత్రం ఒక హగ్ ఇస్తున్నట్లు చెప్పి అందరిని ఆకర్షించాడు. ఏమైనా రాజకీయ ప్రత్యర్థుల చేత అదే పనిగా హగ్ లు మోడీకి మాత్రమే సాధ్యమేమో?