Begin typing your search above and press return to search.

అరెస్టు చేసిన పట్టాభిని పరుగులు పోలీసులు తీయించారా?

By:  Tupaki Desk   |   22 Oct 2021 5:30 AM GMT
అరెస్టు చేసిన పట్టాభిని పరుగులు పోలీసులు తీయించారా?
X
హాట్ టాపిక్ గా మారిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నోటి మాట.. చివరకు ఆయన్ను అరెస్టు అయ్యేలా చేసింది. అంతేకాదు.. అధికారపార్టీ ఫాలోవర్స్ ను తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అనుచితమైన వ్యాఖ్య చేసిన ఆయన తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రతిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతల ఇళ్లపైనా.. పార్టీ కార్యాలయాలపైనా దాడులు జరగటం తెలిసిందే. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం స్పందించి.. తనను అన్న అనుచితమైన మాటకు అర్థం విడమర్చి చెప్పటం.. ‘నన్నే కాదు నా తల్లిని కూడా అవమానిస్తారా?’ అంటూ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యచేసిన పట్టాభిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తరలించి.. ఆ తర్వాత కోర్టుకు.. జైలుకు తరలించటం తెలిసిందే. అయితే.. పోలీస్ స్టేషన్ కు తరలించే వేళలో.. పోలీసులు అనుసరించిన పద్దతి ఏ మాత్రం సరిగా లేదన్న వాదన వినిపిస్తోంది. పట్టాభి నోటి నుంచి వచ్చిన మాటను పట్టుకొని ఇంత రార్దాంతం చేస్తున్న ఏపీ అధికారపక్ష నేతలు.. గతంలో చంద్రబాబును.. లోకేశ్ ను ఉద్దేశించి ఎంత దారుణమైన తిట్టు తిట్టారో తెలిసిందే కదా? అని విమర్శిస్తున్నారు. అంతేకాదు.. వైసీపీకి చెందిన కొందరు మంత్రులు అయితే.. మరింత దారుణంగా బూతులు తిట్టారని.. అప్పుడుకనీసం స్పందించని పోలీసులు.. పట్టాభి విషయంలో మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శించారంటూ తప్పు పడుతున్నారు.

అయితే.. ఈ వాదనను వైసీపీ నేతలు.. సానుభూతిపరులు.. అభిమానులు మాత్రం తప్పు పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చే క్రమంలో పట్టాభి విషయంలో వ్యవహరించిన వైఖరి సరికాదన్న మాట వినిపిస్తోంది. వాహనంలో తీసుకొచ్చిన ఆయనన్ను.. వాహనం దిగిన తర్వాత పూర్తి బందోబస్తుతో ఉన్నప్పటికీ.. ఆయన రెండు భుజాల్ని బలంగా పట్టుకోవటం.. నడిపించటం కాకుండా పరుగులు తీయించినట్లుగా వ్యవహరించిన వైనం సరికాదంటున్నారు. అరెస్టు చేసి.. అదుపులోకి తీసుకోవటం చట్టప్రకారమే జరిగినట్లు చెబుతున్న వేళ.. పట్టాభిని పోలీస్ స్టేషన్ కు తరలించిన వైనంపై బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.