Begin typing your search above and press return to search.

అదృశ్యమైన కరోనా అనుమానితుడు...

By:  Tupaki Desk   |   12 March 2020 8:40 AM GMT
అదృశ్యమైన కరోనా అనుమానితుడు...
X
చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ ప్రపంచంలోని 120 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు ఈ వైరస్ భారినపడి సుమారుగా 4 వేలమందికి పైగా మృతిచెందారు. అలాగే ప్రస్తుతం 1,26,369 మంది కరోనా వ్యాధితో భాదపడుతున్నారు. ఈ వైరస్ భారత్ లో కూడా తన పంజా విసురుతోంది. ఇప్పటి వరకు భారత్ లో 62 పాజిటివ్ కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. కర్ణాటకలో కరోనా అనుమానిత లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు వీసాలను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇకపోతే, కరోనా వైరస్ లక్షణాలున్న ఓ వ్యక్తి ఆసుపత్రి నుంచి అదృశ్యమైన ఘటన బీహార్ రాష్ట్రంలోని బీహార్ షరీఫ్ పట్టణంలో వెలుగుచూసింది. నలంద జిల్లా నౌరంగా పట్టణానికి చెందిన గౌతం కుమార్ ఢిల్లీలో పనిచేస్తున్నాడు. గౌతం కుమార్ ఈ నెల 4వతేదీన కరోనా వైరస్ లక్షణాలైన దగ్గు, జ్వరం, గొంతునొప్పి లక్షణాలతో నౌరంగా పట్టణానికి తిరిగివచ్చారు. గౌతమ్ కి కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో, అతని కుటుంబసభ్యులు సదర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

గౌతం కుమార్ ను పరీక్షించిన వైద్యులు అతని రక్తనమూనాలను సేకరించి ఐసోలేషన్ వార్డులో ఉండాలని సూచించారు. అయితే గౌతం కుమార్ మళ్లీ వస్తానని చెప్పి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉండకుండా పారిపోయాడు. కరోనావైరస్ లక్షణాలున్న రోగి పరారవడంతో వైద్యులు, స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.