Begin typing your search above and press return to search.

దింపుడు కళ్లెం పని చేసింది.. లేచి కూర్చున్న శవం.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   18 Dec 2022 12:30 AM GMT
దింపుడు కళ్లెం పని చేసింది.. లేచి కూర్చున్న శవం.. ఎక్కడంటే?
X
మరణించిన వారు ఎవరైనా సరే.. అంతిమ యాత్ర సందర్భంగా దింపుడు కళ్లెం ఆశ పేరుతో.. శవాన్ని కిందకు దించి.. నోట్లో పాలు పోయటం.. కొందరు గంగనీరు పోయటం.. చెవితే నారాయణ.. నారాయణ అంటూ పఠించటం.. ఇలా ఎవరికి అలవాటైనవి వారు చేస్తుంటారు.

ఇదంతా కూడా చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడన్న చివరి ఆశతో చేస్తుంటారు. ఇలా చేసినంత మాత్రాన చనిపోయినోళ్లు లేచి కూర్చునే ఉదంతాలు అస్సలు కనిపించవు. ఇలాంటి సీన్లు ఏమైనా ఉంటే సినిమాల్లో మాత్రమే ఉంటాయి. అది కూడా యమ ధర్మరాజు ఏదో తప్పు చేసి.. ఇలా జరుగుతుందని చూపిస్తుంటారు.

తాజాగా మాత్రం తమిళనాడులో చనిపోయిన ఒక వ్యక్తి అంతిమ యాత్ర మధ్యలో దింపుడు కళ్లెం ఆశ సందర్భంగా నోట్లో పాలు పోస్తే.. లేచి కూర్చున్న ఉదంతంలో చోటు చేసుకుంది. దీంతో.. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు.. బంధువులు ఒక్కసారిగా అవాక్కు అయిన పరిస్థితి. అసలేం జరిగిందంటే.. తమిళనాడులోని పుదుకోట జిల్లా ఆలంపట్టి మురండాంపట్టి గ్రామంలో 60 ఏళ్ల రైతు షణ్ముగం గుండె..

కాలేయ సమస్యలతో బాధ పడుతున్నాడు. అతడు తీవ్ర అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకోవటంతో దగ్గర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతడ్ని పరిశీలించిన వైద్యులు మరణించినట్లుగా చెప్పారు. దీంతో గ్రామానికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు అతడ్ని ఇంటి వద్దకు తీసుకొచ్చారు.

అంతిమయాత్ర సందర్భంగా షణ్ముగం నోట్లో పాలు పోశారు. అప్పటివరకు చలనం లేకుండా ఉన్న అతను ఒక్కసారి దగ్గుతూ కళ్లు తెరిచాడు. దీంతో బంధువులు ఒక్కసారిగా బిత్తరపోయారు. షణ్ముగం మాత్రం ఏం జరిగిందంటూ లేచి కూర్చోవటం సంచలనంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.