Begin typing your search above and press return to search.

17 కోట్లు క‌డితే..ఆయ‌న‌తో క‌లిసి లంచ్ చేయ‌చ్చు!

By:  Tupaki Desk   |   11 Jun 2017 10:22 AM GMT
17 కోట్లు క‌డితే..ఆయ‌న‌తో క‌లిసి లంచ్ చేయ‌చ్చు!
X
వారెన్ బ‌ఫెట్‌.....స‌మ‌కాలీన‌ ప‌రిణామాల గురించి అవ‌గాహ‌న ఉన్న వారిలో ఈ పేరు తెలియనిది అతి కొద్దిమందే అన‌డం అతిశ‌యోక్తి కాదేమో! ఎందుకంటే ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుల జాబితాలో నాలుగో ప్లేస్ సాధించారు. ఆయ‌న కు స్మార్ట్ ఇన్వెస్ట‌ర్ అని కూడా పేరుంది. ఎందరికో ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కుడు. అలాంటి మార్గ‌ద‌ర్శ‌కుడితో కాసేపు ముచ్చటించే అవ‌కాశం దొర‌క‌డం అదృష్ట‌మే. ఇక భోజనం చేస్తూ మాట్లాడ‌టం వంటిది అయితే ఎంతో గొప్ప‌. అయితే.. ఆయ‌న‌తో క‌లిసి లంచ్ చేయాల‌నుకుంటే మాత్రం మ‌న క‌రెన్సీలో దాదాపు 17 కోట్ల దాకా క‌ట్టాల‌ట‌.

వారెన్ బ‌ఫెట్ తో లంచ్ చేయ‌డానికి రూ.17.25 కోట్లకు పైగా చెల్లించి మ‌రీ సిద్ధ‌మ‌య్యాడు ఓ వ్య‌క్తి. ఆయ‌న వివ‌రాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు. బిడ్ ధ‌ర 2,679,001 డాల‌ర్లు ప‌లికింద‌ట‌. అంటే మ‌న క‌రెన్సీ లో 17.25 కోట్ల‌కు పైమాటే. ఈ డ‌బ్బును గ్లైడ్ ఫౌండేష‌న్ అనే చారిటీ సంస్థ‌కు విరాళంగా ఇవ్వ‌నున్నార‌ట‌ వారెన్ బ‌ఫెట్. 2004 లో త‌న మొద‌టి భార్య చ‌నిపోయిన త‌ర్వాత ఈ ఫౌండేష‌న్ తో క‌లిసి పని చేస్తున్నారు బ‌ఫెట్. గ‌త సంవ‌త్స‌రం బ‌ఫెట్ లంచ్ కోసం బిడ్ వేయ‌గా ధ‌ర 3,456,789 డాల‌ర్లు ప‌లికింద‌ట‌. అంటే..22 కోట్ల రూపాయ‌ల‌కు పైమాటే. వామ్మో.. ఎన్ని జ‌న్మలెత్తినా మ‌నం వారెన్ బ‌ఫెట్ తో క‌లిసి లంచ్ చేయ‌లేం కాబోలు ఏమంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/