Begin typing your search above and press return to search.
జగనన్న ఇల్లు భలే కాస్టు గురూ !
By: Tupaki Desk | 20 Jun 2022 10:30 AM GMTఆంధ్రావనిలో జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణం అన్నది పేదలకు తలకు మించిన భారంగానే ఉంది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఇస్తున్న లక్షా ఎనభై వేల రూపాయలు కూడా చాలడం లేదు.
ఇవి కూడా కేంద్రం ఇస్తున్నా పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న విధంగా ఉంటోందని ఇప్పటికే అనేక సార్లు బీజేపీ మండిపడుతోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంతో సహా వివిధ పథకాల పేరిట కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా జగన్ సర్కారు ఏమీ పైకి చెప్పకుండా కప్పదాటు వ్యవహారం మాదిరి ప్రవర్తిస్తోందని కూడా కమలనాథులు విమర్శలు చేశారు.
మారుతున్న మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేయాలి అంటే, జగన్ ఇచ్చిన సెంటు లేదా సెంటున్నర భూమిలో కావాల్సిన కనీస సౌకర్యాలు అందుకోవాలంటే కనీసం మరో రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు అవసరం అవుతాయి అన్నది తేలింది.
అంటే ఇప్పటికిప్పుడు సిమెంట్, ఐరన్ ధరలు దిగివచ్చినా కూడా ఆ పాటి మొత్తాన్ని తాము భరించడం కష్టమేనని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంకాస్తవివరం ఆరా తీస్తే కొన్ని చోట్ల మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ అవుతోందని కూడా తెలుస్తోంది. ఇంటి నిర్మాణానికి సిమెంట్, ఇనుముతో సహా ఇతర సామాగ్రి, కూలీల ఖర్చుతో కలుపుకుని ఐదు లక్షల రూపాయలు కావాల్సి ఉందని తాజా లెక్కలుతేల్చాయి.
లాక్డౌన్ ముందు అయితే మూడు లక్షలతో తేలిపోయేదే అని కానీ ఇప్పుడు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇంటి నిర్మాణం తలకుమించిన భారం అని లబ్ధిదారులు వాపోతున్నారు.
వాస్తవానికి 2020 డిసెంబర్ నాటి ధరల మేరకు ఇంటి నిర్మాణం చేపట్టినా కూడా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఏపాటికీ కాదని తేలిపోయింది. అయితే జగన్ స ర్కారు ఇంటి నిర్మాణం చేపట్టకపోతే తాము ఇచ్చిన పట్టా భూమిని వెనక్కు తీసుకుంటామని లబ్ధిదారులను వారు హెచ్చరిస్తున్నారు.