Begin typing your search above and press return to search.

వణికిపోతున్న ఐరోపా దేశాలు

By:  Tupaki Desk   |   22 Oct 2022 9:30 AM GMT
వణికిపోతున్న ఐరోపా దేశాలు
X
యూరప్ దేశాలు అప్పుడే వణికిపోతున్నాయి. పెరిగిపోతున్న చలివల్ల ఇపుడు వణికిపోవటం కాదు రాబోయే చలికాలాన్ని ఎలా తట్టుకోవాలా అని ఇపుడు వణికిపోతున్నాయి. యూరోపు దేశాల్లో చలికాలం అంటే మైనస్ డిగ్రీల్లోకి పడిపోతుంది వాతావరణం. అలాంటి చలిని తట్టుకోవాలంటే మామూలుగా సాధ్యం కాదు. ఇల్లు మొత్తాన్ని వెచ్చగా ఉంచుకోకుండా చలిని జనాలు తట్టుకోలేరు. ఇల్లుమొత్తం వెచ్చగా ఉండాలంటే గ్యాస్ చాలా చాలా అవసరం. ఇపుడా గ్యాస్ కొరతే జనాలందరినీ వణికించేస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా ఆగిపోయింది. ఉక్రెయిన్ మీద ఏకపక్షంగా రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా అమెరికాతో పాటు మిత్రపక్షాల దేశాలన్నీ రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. దాంతో మండిపోయిన రష్యా యూరోపు దేశాలకు సరఫరా చేస్తున్న గ్యాస్ ను నిలిపేసింది. ఎప్పుడైతే రష్యా గ్యాస్ సరఫరాను నిలిపేసిందో వెంటనే పై దేశాల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. యూరోపు దేశాల్లో గ్యాస్ లేనిదే ఏపనీ జరగదు.

ఫ్యాక్టరీలు, ఆపీసులు, ఇళ్ళు, రెస్టారెంట్లు, బిజినెస్ మొత్తం గ్యాస్ మీద నడుస్తుంటాయి. గ్యాస్ లేనిదే యూరోపు దేశాలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, పోలండ్ లాంటి దేశాలు తమ గ్యాస్ అవసరాలకు 80 శాతం రష్యామీదే ఆధారపడున్నాయి. రష్యా గ్యాస్ సరఫరా నిలిపేసేనాటికి కొనుగోలు చేసిన గ్యాస్ నిల్వలు ఇపుడు అయిపోతున్నాయి. ఈ నిల్వలు ఇక ఎన్నోరోజులు రావన్న విషయం అర్ధమైపోయింది.

అర్జంటుగా గ్యాస్ సరఫరా కాకపోతే జనజీవనం స్తంబించిపోవటం ఖాయం. పైగా తొందరలోనే చలికాలం మొదలవ్వబోతోంది. దీంతో చలికాలాన్ని ఎలా తట్టుకోవాలో యూరోపు దేశాలకు అర్ధం కావటంలేదు. జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో గ్యాస్ నిల్వలున్నప్పటికీ అవి తవ్వి బయటకు తీయటం లేదు.

ఎందుకంటే వాతావరణ కాలుష్యం కాకుండా తమ దేశాల్లోని గ్యాస్ నిల్వలను తవ్వకుండా రష్యామీదే ఆధారపడ్డాయి. ఇపుడు రష్యా గ్యాస్ సరఫరాను నిలిపేసింది. ప్రత్యామ్నాయంగా గ్యాస్ కొనాలంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సుంటంది. దాంతో చలికాలాన్ని ఎలా నెట్టుకురావాలో తెలీక యూరోపుదేశాలు తలలు పట్టుకున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.