Begin typing your search above and press return to search.

2 వేలమంది విద్యార్ధులకు ఊరట

By:  Tupaki Desk   |   14 Oct 2022 5:56 AM GMT
2 వేలమంది విద్యార్ధులకు ఊరట
X
మెడిసిన్ చదువుతు ఉక్రియిన్ నుండి వెనక్కు వచ్చేసిన వేలాదిమంది విద్యార్ధులకు కాస్త ఊరట లభించింది. ఉక్రెయిన్ నుండి భారత్ వచ్చేసిన వేలాదిమంది విద్యార్ధులను తమ కాలేజీల్లో చేర్చుకునేందుకు కొన్ని దేశాలు ముందుకొచ్చాయి.

ఇందులో భాగంగానే ఉజ్బెకిస్ధాన్ దేశం ఒక్కసారిగా 2వేల మంది విద్యార్ధులను చేర్చుకుంటు అవసరమైన అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేసింది. ఇంకా అవసరమైతే మరింతమంది విద్యార్ధులను చేర్చుకునేందుకు తాము రెడీగా ఉన్నట్లు ఉజ్బెకిస్ధాన్ రాయబారి దిల్షోత్ అఖతోవ్ ప్రకటించారు.

సో ఉజ్బెకిస్ధాన్ రాయబారి ప్రకటన ప్రకారం తొందరలోనే వేలాదిమంది విద్యార్ధులు తమ మెడిసిన్ చదువును కంటిన్యు చేయవచ్చు. ఉజ్బెకిస్ధానే కాకుండా జార్జియా, కజకిస్ధాన్ లాంటి దేశాలు కూడా భారత్ విద్యార్ధులను చేర్చుకునేందుకు ముందుకొచ్చాయి. డబ్బులు వస్తాయి కాబట్టి ఏ దేశమైనా మన విద్యార్ధులను చేర్చుకునేందుకు పోటీపడటంలో ఆశ్చర్యంలేదు. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఒకటుంది. అదేమిటంటే ఉక్రెయిన్లో మెడిసిన్ విద్య 6 సంవత్సరాలు.

అన్ని సంవత్సరాలు కష్టపడి చదివిన విద్యార్ధులు మరో 6 మాసాల్లో ఫైనల్ పరీక్షలు రాయాల్సుండగా యుద్ధం మొదలైంది. రష్యా దెబ్బకు ఉక్రెయిన్ నాశనం అయిపోతున్న కారణంగా వేలాదిమంది విదేశీయులు ఉక్రెయిన్ నుండి తమ దేశాలకు వెళ్ళిపోయారు. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ లో చదువుతున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న సుమారు 30 వేలమంది భారత్ కు తిరిగొచ్చేశారు. వీరిలో సుమారు 23 వేలమంది మెడిసిన్ చదువుతున్న వాళ్ళే.

ఇపుడు సమస్య ఏమిటంటే ఇతర దేశాల్లో మెడిసిన్ కోర్సులో చేరుతున్న విద్యార్ధులు 6 మాసాల చదువు కంప్లీట్ చేసి ఫైనల్ పరీక్షలు రాస్తే సరిపోతుందా ? లేకపోతే మళ్ళీ 6 ఏళ్ళు చదవాల్సిందేనా ? అన్న విషయంలో క్లారిటిలేదు.

మిగిలిపోయిన చదువును పూర్తిచేసి ఫైనల్ పరీక్షలు రాయటానికి వీలుగా తమను ఇండియాలోని కాలేజీల్లో చేర్చుకోవాలని విద్యార్ధులు చేసిన న్యాయపోరాటం ఫెయిలైంది. అయితే విద్యార్ధుల కోసమని విదేశీ ప్రభుత్వాలతో కేంద్రప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.