Begin typing your search above and press return to search.
విమానంలో ముద్దులతో రెచ్చిపోయిన జంట.. దుప్పటి ఇచ్చిన ఎయిర్ హోస్టస్
By: Tupaki Desk | 27 May 2021 4:35 AM GMTపాకిస్తాన్ కు చెందిన జంట విమానంలో చేసిన పని ఇప్పుడు పెద్ద చర్చగా మారటమే కాదు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విమానంలో ఉన్నామన్న విషయాన్ని వదిలేసి.. తమ ప్రైవేట్ లైఫ్ లో ఏ రీతిలో ఉంటారో.. అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో వ్యవహరించిన ధోరణి ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది. ముద్దులతో జంట ఫుల్ గా ఎంజాయ్ చేస్తే.. ఆ ఎపిసోడ్ లో విమానంలోని విధులు నిర్వర్తిస్తున్న ఎయిర్ హోస్టస్ కు మాత్రం తిట్లు తప్పలేదు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర అంశంగా మారింది. అసలేం జరిగిందంటే?
కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు వెళుతున్న పీఏ200 విమానంలో ఒక జంట ఎక్కారు. ప్రయాణం మొదలైనప్పటి నుంచి వారు ముద్దులతో మోత పుట్టిస్తున్నారు. ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవటం.. వారు చేస్తున్న పనులతో వారి వెనుకా కూర్చున్న వ్యక్తి తెగ ఇబ్బంది పడిపోయాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ ను పిలిచి.. వారి చర్యల గురించి కంప్లైంట్ చేశాడు. దీంతో.. ఆ జంట వద్దకు వెళ్లిన ఎయిర్ హోస్టెస్ విమానంలో మీరు ఇలా చేయొద్దని.. ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు.
అయినప్పటికి ఎయిర్ హోస్టెస్ మాటల్ని ఆ జంట పట్టించుకోలేదు సరికదా.. ముద్దుల్లో మునిగిపోయారు. దీంతో.. ఎయిర్ హోస్టెస్ ఆ జంటకు దుప్పటి ఇచ్చి వెళ్లిపోయారు. ఈ విమానంలో బిలాల్ అనే లాయర్ కూడా ప్రయాణించాడు. ఈ జంట చేసిన పనిలో అతడికి కొత్త కోణం కనిపించింది. ముద్దులతో ఆ జంట అంతలా చెలరేగిపోతుంటే.. వారిపై చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి కంప్లైంట్ చేశాడు. దీంతో స్పందించిన సదరు సంస్థ.. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ సీపీఏ వార్నింగ్ ఇచ్చింది. కపుల్ ముద్దులు.. ఈ ఉదంతంపై లాయర్ చేసిన కంప్లైంట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్.. ట్రోల్స్ తో చెలరేగిపోతున్నారు.