Begin typing your search above and press return to search.
అఖిలప్రియకు కోర్టులో మళ్లీ చుక్కెదురు: బెయిల్ తిరస్కరించిన కోర్టు
By: Tupaki Desk | 18 Jan 2021 10:00 AM GMTబోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో , మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో సోమవారం రోజు మరోసారి చుక్కెదురైంది.
సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అఖిలప్రియపై హైద్రాబాద్ పోలీసులు అదనపు సెక్షన్లు నమోదు చేసి మెమో దాఖలు చేసి , అఖిలప్రియ బయటకి వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని , కాబట్టి అఖిలప్రియ కి బెయిల్ ఇవ్వొద్దు అని కోర్టును కోరింది. దీనితో సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియ బెయిల్ ను తిరస్కరించింది.
జీవిత కాలం శిక్షపడే కేసలు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు రిటర్న్ చేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని అఖిలప్రియ న్యాయవాదులకు కోర్టు సూచించిందిదీంతో నాంపల్లి కోర్టు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనుంది.
ఇదిలా ఉంటే .. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 9 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, చంద్రహాస్ తదితరులు చిక్కితే ఇంకా కీలక సమాచారం దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గతంలో కూడ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఆమె బయటకి వస్తే సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉందని ఉందని పోలీసులు కోర్టుకు చెప్పారు. దీంతో గతంలో కూడ ఆమెకు బెయిల్ ఇవ్వలేదు.