Begin typing your search above and press return to search.

కోర్టు రఘురామను నిలదీసింది... కానీ

By:  Tupaki Desk   |   10 Feb 2022 5:08 AM GMT
కోర్టు రఘురామను నిలదీసింది... కానీ
X
హైకోర్టులో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చుక్కెదురైంది. చింతామణి నాటకాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తు ఎంపీ కోర్టులో కేసు వేశారు. దశాబ్దాలుగా ప్రదర్శితమవుతున్న చింతామణి నాటకాన్ని ప్రభుత్వం నిషేధించేందుకు లేదంటు ఎంపీ కేసు వేశారు.

ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నా దాన్ని తప్పుపట్టడం, కోర్టులో కేసులు వేయటమే పనిగా పెట్టుకున్నారు ఎంపి.

ఇందులో భాగంగానే నాకటంపైన కూడా కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఎంపీని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నాటకాన్ని నిషేధించటానికి వ్యతిరేకంగా కేసు వేయటంలో మీ ఇంట్రస్టు ఏమిటంటు నిలదీసింది. నిషేధాన్ని సవాలు చేయటం వెనుక మీకున్న ప్రయోజనాలు ఏమిటో చెప్పాలంటు గట్టిగా ప్రశ్నించింది. ఎందుకంటే ఎంపీయేమీ కళాకారుడు కాదు నాటకాన్ని నిషేధిస్తే ఉపాధి పోతుందని చెప్పటానికి.

అలాగని వైశ్య సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కూడా కాదు. తమను నాటకంలో అవమానించారని బాధపడేందుకు. రెండు వైపులా దేనితో సంబంధం లేదు కాబట్టే ఎంపీ ప్రయోజనాలపై కోర్టు దృష్టిపెట్టింది. అలాగే ఒక వర్గం జీవనోపాధి, మరో వర్గం మనోభావాలను దెబ్బతీస్తుంటే చూసు ఊరుకోలేం కదా అంటు గట్టిగానే ప్రశ్నించింది. ఒకరి చర్యలపై మరొకరు స్పందించేందుకు హక్కుంటుందని గుర్తించాలని కోర్టు స్పష్టంగా చెప్పింది.

హోలు మొత్తం మీద చూస్తే దాదాపు వందేళ్ళ క్రితం కాళ్లకూరి నారాయణరావు రాసిన చింతామణి నాటకటంలో వైశ్యులనే కాదు ఏ వర్గాన్ని కించపరచలేదు. అప్పటి వేశ్యావృత్తి దురాచారానికి వ్యతిరేకంగా రాసిన నాటకమది. వేశ్యా సంపర్కం తో ఆస్తులు, పరువు పోగొట్టుకున్న వాళ్ళల్లో వైశ్యులే కాదు బ్రాహ్మణులతో పాటు ఇతర అన్ని సామాజిక వర్గాలు ఉన్నట్లు చూపించారు. అయితే కాలక్రమంలో ఆ నాటకాన్ని కొందరు పైత్యకారులు బూతు, అశ్లీలంగా మార్చుకున్నారు.

పాత పాటలను రీమిక్స్ చేసి కొత్తగా రిలీజ్ చేస్తున్నట్లు కాళ్ళకూరి నాటకాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చుకున్నారు. ఆ మార్చుకోవటంలో సుబ్బిశెట్టి పాత్రను కాస్త వెగటుగా చూపించటంతో పాటు డబల్ మీనింగ్ డైలాగులను చొప్పించారు. అవి వైశ్యుల మనోభావాలను దెబ్బతీశాయి. అంతేకానీ ఒరిజినల్ నాటకంలో చాలా చక్కగా ఉంటుంది. మరి విచారణ తర్వాత హైకోర్టు ఏమి చెబుతుందో చూడాలి.