Begin typing your search above and press return to search.
41 మంది మహిళలపై అత్యాచారాలు ..కామాంధుడికి వెయ్యేళ్ల జైలు శిక్ష !
By: Tupaki Desk | 29 May 2021 1:00 PM ISTమహిళలపై ఏ మాత్రం కనికరం లేకుండా కామాంధుడిలా రెచ్చిపోయిన ఓ నరరూప రాక్షసుడికి దక్షిణాఫ్రికాకు చెందిన ఓ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ నరరూప రాక్షసుడు చేసిన నేరాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి వెయ్యేళ్ల జైలు శిక్షను విధించింది. 40 ఇండ్లలో దొంగతనాలు చేయడంతో పాటు 41 మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడినందుకు ఈ జైలు శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. సెల్లో అబ్రమ్ మాపున్యా అనే వ్యక్తి 2014-19 మధ్య ఇండ్లలో చొరబడి దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలతోపాటు మహిళలపై అత్యాచారాలకు కూడా పాల్పడేవాడు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపిన కోర్టు, నిందితుడు సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇండ్లలో చోరీలకు పాల్పడటంతోపాటు 41 మంది మహిళలపై అత్యాచారం చేసినట్టు ధ్రువీకరించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం సెల్లో అబ్రమ్ మాపున్యాకు 1,088 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.