Begin typing your search above and press return to search.
ఆ క్రికెటర్ జంట ఆస్తులు విలువ బారెడు
By: Tupaki Desk | 18 Nov 2022 6:30 AM GMTగుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ జిల్లా నుంచి రివాబా జడేజాను బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోటీకి దింపింది. చదువు రీత్యా ఆమె మెకానికల్ ఇంజనీర్. ఈమె భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య కూడా. ఆమె వయస్సు 32 సంవత్సరాలు.
రవీంద్ర జడేజా -రివాబా జడేజా 2016లో వివాహం చేసుకున్నారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పాపులర్ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకరు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు మొత్తం ఆస్తులు రూ.70.48 కోట్లు కావడం విశేషం. రివాబా జడేజా ఆస్తులు క్రికెటర్ ఆస్తితో కలిపి ఏకంగా రూ.97.25 కోట్లుగా మారాయి.
రివాబాకు రూ.64.3 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆమె సొంత ఆస్తుల విలువ రూ.57.60 లక్షలు. ఆమె భర్త మొత్తం ఆస్తులు రూ.37.43 కోట్లు. ఆమెకు ఎలాంటి స్థిరాస్తులు లేవు. అయితే ఆమె భర్తకు మొత్తం రూ.33.05 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో గుజరాత్ -జామ్‌నగర్‌లోని దుకాణాలు , వాణిజ్య మార్కెట్లు , జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్ రెస్టారెంట్‌లో 50 శాతం వాటా ఉన్నాయి. వారికి రాజ్‌కోట్, జామ్‌నగర్ , అహ్మదాబాద్‌లలో ఆరు ఇళ్లు ఉన్నాయి. రవీంద్ర జడేజా వోక్స్‌వ్యాగన్ పోలో జిటి, ఫోర్డ్ ఎండీవర్ , ఆడి క్యూ7 కార్లు కలిగి ఉన్నారు.
రివాబా వ్యాపారవేత్త హర్దేవ్ సింగ్ సోలంకి కుమార్తె. ఆమె తల్లి పేరు ప్రఫుల్లబా సోలంకి. ఆమె ఆత్మీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. రివాబా కాంగ్రెస్ రాజకీయ నాయకుడు హరి సింగ్ సోలంకి మేనకోడలు కావడం గమనార్హం. రివాబా 2019లో బీజేపీలో చేరారు. దానికి ముందు, ఆమె రైట్-వింగ్ గ్రూప్ కర్ణి సేన మహిళా విభాగం చీఫ్‌గా నియమితులయ్యారు.
రివాబా జడేజాకు రవీంద్ర జడేజాకు పరిచయముంది. రవీంద్ర జడేజా సోదరికి రివాబా స్నేహితురాలు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహాన్ని వారి కుటుంబ సభ్యులు అనుమతించడంతో పెళ్లి జరిగింది. వీరి నికర ఆస్తుల విలువ ఇప్పుడు భారీగా నమోదైంది. క్రికెటర్లలోనే భారీగా ఆస్తులు కూడబెట్టిన వారిలో రవీంద్ర జడేజా కూడా ఒకరు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.