Begin typing your search above and press return to search.
పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీఎం కూతురు..పెళ్లికొడుకు ఎవరంటే ?
By: Tupaki Desk | 10 Jun 2020 9:10 AM GMTకేరళ ముఖ్యమంత్రి కూతురు వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యారు. సీఎం కూతురు బెంగుళూరులో స్టారప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక పెళ్లి కొడుకు ఓ ప్రముఖ రాజకీయ పార్టీలో యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అయితే సీఎం కూతురికి గతంలో వివాహం జరిగి ఓ కుమారుడు ఉన్నాడు. పెళ్లి కొడుకు గతంలో పెళ్లి చేసుకుని ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు. ఇంతకు ముందే వీరువురు వైవాహిక జీవితాలు విడాకులతో ముగియడంతో ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కానుంది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కమల విజయన్ దంపతుల పెద్ద కుమార్తె వీణా బెంగళూరులో ఆరు సంవత్సరాల క్రితం సొంతంగా స్టారప్ సంస్థ ఎక్సోలాజిక్ సెల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా భాద్యతలు చూసుకుంటున్నారు. రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ పి. ఎం. అబ్దుల్ ఖాదర్ కుమారుడు మహ్మద్ రియాజ్ ఫిబ్రవరి 2017 లో డివైఎఫ్ ఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మార్క్సిస్ట్ పార్టీతో సంబంధం ఉన్న రియాజ్ జాతీయ స్థాయి యువ నాయకుడిగా ఎదిగారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో కోజికోడ్ నుంచి పోటీ చేసిన మహమ్మద్ రియాజ్ యూడీఎఫ్ నేత రాఘవన్ చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా, సీపీఎం నాయకుడు మహమ్మద్ రియాజ్ ల పెళ్లి జూన్ 15వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే , ఈ వైరస్ తాండవం చేస్తున్న సమయంలో సీఎం కూతురు వీణా, మహమ్మద్ రియాజ్ ల పెళ్లి చాలా సింపుల్ గా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిపించాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు.