Begin typing your search above and press return to search.
దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం టైం డిసైడ్ చేశారు
By: Tupaki Desk | 23 Dec 2019 5:07 AM GMTదిశ హత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారితే.. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగుర్ని హైదరాబాద్ పోలీసులు (సాంకేతికంగా చూసినప్పుడు మాత్రం సైబరాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోకి వస్తుంది) జరిపిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వైనం మరింత సంచనలంగా మారింది. పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు దిశ నిందితులు ప్రయత్నిస్తే.. వారిని నిలువరించే క్రమంలో కాల్పులు జరిపినట్లుగా పోలీసులు చెప్పారు.
ఎన్ కౌంటర్ మీద పలు ఆరోపణలు రావటంతో నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టంను మరోసారి నిర్వహించాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. అయితే.. కోర్టు నిర్ణయం తీసుకోవటానికి కాస్త సమయం పడుతున్న నేపథ్యంలో వారి డెడ్ బాడీస్ ను భద్రపర్చాలని కోర్టు పేర్కొంది.
దీంతో వారిని షాద్ నగర్ నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి మార్చురీలోని ప్రత్యేక ఫ్రీజర్ బాక్సుల్లో ఉంచారు. అయితే.. మృతదేహాలు అంతకంతకూ చెడిపోతున్న నేపథ్యంలో వెనువెంటనే రీపోస్టుమార్టం నిర్వహించాలని నిమ్స్ డైరెక్టర్ కోర్టుకు చెప్పటంతో ఈ రోజు (సోమవారం) వారికి ఢిల్లీలోని ఎయిమ్స్ నిపుణుల చేత రీపోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు నాలుగు మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం లోపు తమ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా రీపోస్టుమార్టం ప్రక్రియను వీడియో షూట్ చేసి ఉంచుతారని చెబుతున్నారు. ఈ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి నిందితుల కుటుంబాలకు వారి మృతదేహాలను అందజేయనున్నారు. రీపోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసి.. కలెక్షన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ను సీల్డ్ కవర్ లో భద్రపర్చనున్నారు.