Begin typing your search above and press return to search.

శివసేన కు డెడ్ లైన్ ఈ రాత్రి 7.30 వరకే

By:  Tupaki Desk   |   11 Nov 2019 5:22 AM GMT
శివసేన కు డెడ్ లైన్ ఈ రాత్రి 7.30 వరకే
X
మహా రాష్ట్ర పీఠం మీద ముఖ్యమంత్రి హోదా లో కూర్చునే వ్యక్తి కచ్ఛితంగా శివసేన కు చెందిన నేతే అంటూ అదే పనిగా చెబుతున్న సేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు డెడ్ లైన్ పెట్టేశారు మహా రాష్ట్ర గవర్నర్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది గా బీజేపీ ని ఆహ్వానించిన గవర్నర్ కు.. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదని చెప్పి వెనక్కి తగ్గటం తెలిసిందే. దీంతో.. ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీ గా అవతరించిన శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది గా గవర్నర్ కోరారు.

అయితే.. ఈ రోజు (సోమవారం) రాత్రి 7.30 గంటల వరకు మాత్రమే సమయం ఇచ్చారు. ఈ లోపు సేన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ చెప్పినట్లు బలాన్ని నిరూపించుకున్న పక్షం లో ప్రభుత్వ ఏర్పాటు కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.

మొత్తం 288 స్థానాలున్న మహా రాష్ట్ర అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తాజాగా శివసేన కు 56 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే.. 54 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎన్సీపీ.. 44 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీలు కానీ మద్దతు ఇస్తే.. సులువు గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటాని కి వీలు కలుగుతుంది.

గవర్నర్ ప్రకటన నేపథ్యం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సేన అధి నాయకత్వం పావులు కదుపుతోంది. అయితే.. ఆ పార్టీ కి మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ.. కాంగ్రెస్ లు కండీషన్లు పెడుతున్నాయి. బీజేపీ తో ఉన్న బంధాన్ని శివసేన పూర్తి గా తెంచుకుంటే తప్పించి తాము మద్దతు ఇవ్వమని చెబుతున్నాయి. అంతేకాదు.. కాంగ్రెస్ అధి నేత్రి సోనియా ను కలిసి.. ఆమె అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే తమ మాట చెబుతామ ని ఎన్సీపీ అధి నేత శరద్ పవార్ స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు.. తాము మహా రాష్ట్ర లో రాష్ట్ర పతి పాలనను కోరుకోవటం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్న వేళ.. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు పార్టీలు (ఎన్సీపీ.. కాంగ్రెస్) కలిసి వస్తాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిమిషాలు గడుస్తున్నకొద్దీ.. డెడ్ లైన్ దగ్గర పడే వేళ.. తనకున్న తక్కువ సమయంలో గవర్నర్ కోరినట్లు సేన తన సత్తాను చాటుతుందా? అన్నది ఇప్పుడు ఉత్కంటను రేపుతోంది.