Begin typing your search above and press return to search.
తెలంగాణ లో కలకలం: మంత్రి హరీశ్ రావు పీఏకు - ఓ ఎమ్మెల్యేకు వైరస్?
By: Tupaki Desk | 12 Jun 2020 3:30 PM GMTమహమ్మారి వైరస్ తెలంగాణలో భీకరంగా దాడి చేస్తోంది. ప్రస్తుతం రోజుకు వందకు పైగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు వైరస్ పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ డ్రైవర్‌కు పాజిటివ్ రావడంతో ఆ కుటుంబమంతా హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఆయనకు వైరస్ పరీక్షలు చేశారు. ఇంకా ఫలితం తేలాలి. యాదాద్రి దేవస్థానం పాలకవర్గంలోని ఇద్దరు దంపతులకు కూడా వైరస్ సోకింది. ఇప్పుడు తాజాగా మంత్రి హరీశ్ రావు పీఏ కూడా వైరస్ బారిన పడ్డారని సమాచారం.
హరీశ్ రావు పీఏకు కరోనా సోకిన విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం అతడికి పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది వాస్తవమైతే మంత్రి కూడా హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే. మంత్రితో అతడి కుటుంబసభ్యులంతా ఇంటిలోనే ఉండాలి. సిద్ధిపేట జిల్లాలో వైరస్ కట్టడి చర్యలు పక్కాగా అమలుచేస్తున్న మంత్రి హరీశ్ రావుకే ఇప్పుడు వైరస్ వెంటాడుతోంది. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మంత్రి హరీశ్ రావు ప్రజలను వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు, కట్టడి చర్యలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో ఇద్దరు కలెక్టర్లు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ఇంటికి పరిమితమయ్యారు. తెలంగాణలోని ఓ ఎమ్మెల్యేకు వైరస్ సోకిందని సమాచారం. అతడి వివరాలు బహిర్గతం చేయడం లేదు. ఈ విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వైరస్ బారిన పడుతుండడంతో తెలంగాణలో కలకలం రేపుతోంది.