Begin typing your search above and press return to search.
రెండేళ్లలో 10 బ్యాంకుల నుంచి ఏపీ సర్కారు చేసిన అప్పులు రూ.57వేల కోట్లు
By: Tupaki Desk | 8 Dec 2021 5:30 AM GMTఒక ప్రశ్నకు వచ్చిన తాజా సమాధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా చెవులు రిక్కించి వినాల్సిన అవసరం ఉంది. తాజాగా రాజ్యసభలో ఒక రాజ్యసభ సభ్యుడు ప్రశ్నించిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. ప్రశ్న ఏమంటే.. గడిచిన రెండేళ్లలో ఏపీలోని జగన్ ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులెంత? ఏ బ్యాంకు నుంచి ఎంతెంత అప్పు తీసుకున్నారని.
దీనికి కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం విన్నంతనే షాక్ తినే పరిస్థితి. జస్ట్ రూ.57వేల కోట్లకు పైనే అప్పులు చేశారంటూ భారీ బాంబ్ నే పేల్చారు. ఇంతకీ ఏపీ సర్కారుకు అంత భారీగా అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఏమిటన్న వివరాల్ని ఆయన వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తాజాగా రాజ్యసభలో ఏపీ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలుగా బ్యాంకుల నుంచి చేసిన అప్పుల వివరాల్ని వెల్లడించాల్సిందిగా కోరారు.
దీంతో కేంద్ర ఆర్థిక శాఖ బదులిచ్చింది. ఏపీ ప్రభుత్వం పది బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పు చేసిందన్నారు. 40 ప్రభుత్వ కార్పొరేషన్లు.. సంస్థలకు బ్యాంకులు అప్పులు ఇచ్చినట్లుగా వెల్లడించారు. అప్పులు ఇచ్చిన బ్యాంకుల్లో దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ.. రూ.11,937 కోట్ల రుణాన్ని ఇచ్చిందని చెప్పారు.
మరో ఐదు సంస్థలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.10,865 కోట్ల రుణాన్ని తీసుకున్నారని.. మరోమూడు సంస్థలు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.7వేల కోట్లు రుణం ఇచ్చినట్లు చెప్పారు.
ఇలా మొత్తం పది బ్యాంకులు వేలాది కోట్ల రూపాయిల అప్పుల్ని ఏపీ ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు అందజేశాయి. ఈ అప్పుల అసలు.. వడ్డీ మొత్తాన్ని చెల్లించే బాధ్యత సదరు కార్పొరేషన్లు.. ఆయా సంస్థలేనని కేంద్రం స్పష్టం చేసింది.
2019 నుంచి 2021 నవంబరు వరకు జాతీయ బ్యాంకులు ఏపీలోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లకు.. కంపెనీలకు రుణాల్ని జారీ చేశారన్నారు. మరి.. ఇంత భారీగా చేసిన అప్పులు దేని కోసం ఖర్చు చేశారు? వీటిని తిరిగి ఆయా బ్యాంకులకు చెల్లించేందుకు అవసరమైన నిధుల్ని ఎలా తీసుకురానున్నారు? ఈ సందర్భంగా ప్రజల నడ్డి మీద పడే పన్ను వాతలు ఏ రేంజ్ లో ఉంటాయన్న ఆలోచనే వణుకు తెప్పించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
ఏ బ్యాంకు ఎంత అప్పును ఏపీ ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పులు ఇచ్చిందన్నది చూస్తే..
1. భారతీయ స్టేట్ బ్యాంక్ రూ.11,937 కోట్లు (9 సంస్థలకు)
2. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.10,865 కోట్లు (ఐదు కంపెనీలు.. కార్పొరేషన్లకు)
3. బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.7 వేల కోట్లు (మూడు సంస్థలకు)
4. యూనియన్ బ్యాంకు రూ.6,975 కోట్లు
5. పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.5633 కోట్లు
6. ఇండియన్ బ్యాంకు రూ.5500 కోట్లు
7. కెనరా బ్యాంకు రూ.4,099 కోట్లు
8. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.2970 కోట్లు
9. ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ రూ.1750 కోట్లు
10. పంజాబ్ అండ్ సింథ్ బ్యాంకు రూ.750 కోట్లు